1, 2, 3, 4… ఇదేదో టీవీ యాడ్ లో వినిపించే సౌండ్ లా ఉందే అనుకుంటున్నారా ? అవును అలాంటిదే కాకపోతే ఇది ఆ సంస్థ సాదించిన ర్యాంకుల సంఖ్య కాదు. వారు పెడుతున్న ఒత్తిడికి తట్టుకోలేక బలవుతున్న విద్యార్థుల క్రమం. తాజాగా హైదబాద్ శ్రీ చైతన్య కళాశాలలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తమ కాలీజీ డీన్ తిట్టిందని మనస్తాపం చెందిన విద్యార్థిని అర్చన ఆత్మహత్య చెసుకుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే…హైదరాబాద్ లోని సరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శ్రీ చైతన్య మహిళ జూనియర్ కళాశాల ఉంది. ఇందులో సంస్థాన్ నారాయణపురానికి చెందిన అర్చన అనే విద్యార్థిని ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది.
ఈ క్రమంలో ఎప్పటిలాగే కాలేజ్ కు వెళ్లిన అర్చనను కళాశాల డీన్ మమతా మార్కులు సరిగా రాలేదని హేళనగా మాట్లాడి తిట్టడంతో మనస్థాసం చెందిన అర్చన బలవన్మరణానికి పాల్పడింది. శ్రీ చైతన్య ఆధ్వర్యంలోనే నడుస్తున్న హాస్టల్ లోనే ఫ్యాన్ కు ఉరేసుకుంది. ఈ సంఘటనను గమనించిన సిబ్బంది ఆమెను హాస్పటల్ కు తరలించగా అక్కడి డాక్టర్లు విద్యార్థిని అప్పటికే మరణించిందని చెప్పారు. విషయం విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియడంతో వారు అక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ కూతురిని శ్రీ చైతన్య యాజమాన్యమే పొట్టనబెట్టుకుందని వాపోయారు. విద్యార్థి సంఘాలు కూడా ఈ విషయంపై భగ్గుమన్నాయి. విద్యార్థి కుటుంబ సభ్యులకు న్యాయం చేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు..