ఈ రోజుల్లో ఒక్క పెళ్లి చేసుకోవడమే గొప్ప విషయం అనుకుంటుంటే..కొందరు ఏకంగా మూడు , నాలుగు చేసుకుంటున్నారు. ఆ లిస్ట్ లో కే వస్తుంది చిరంజీవి చిన్న కూతురు అంటున్నారు ప్రముఖ జొతిష్యుడు వేణు స్వామి. సెలబ్రిటీల జీవితాల్లో జరగబోయే విషయాలని ముందుగానే చెప్పేసే ఈయన..మెగా కుటుంబంలో ను నాలుగు పెళ్లిలు చేసుకుంటారు అంటూ బిగ్ బాంబ్ పేల్చారు.
చిరంజీవి కూతురు శ్రీజ, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇద్దరి జీవితాల్లోను నాలుగు పెళ్లిలు రాసి ఉన్నాయి అని చెప్పుకొచ్చారు. గత కొన్ని రోజులుగా శ్రీజ తన రెండవ భర్త కళ్యాణ్ తో దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వీళ్లు విడాకులు కూడా తీసుకున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ మెగా డాటర్ మూడో పెళ్లికి కూడా రెడీ అయ్యిందట. ఇప్పటికే ఇద్దరి మొగుళ్లను వదిలేసిన ఈ మెగా డాటర్..ఇప్పుడు మూడో భర్త గా తన క్లోజ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతుందని ఓ న్యూస్ సినీ వర్గాలల్లో వినిపిస్తుంది..దీని పై కొందరు సినీ సెల బ్రిటీలు కూడా స్పందిస్తూ..అమ్మాయి పెళ్లి చేసుకోకపోతేనే బెటర్ అన్న సజీషన్స్ కూడా ఇచ్చారు.
అయితే, నిజానికి ఈ పెళ్ళి చిరంజీవికి ఇష్టం లేదట. కానీ , పవన్ కళ్యాణ్ నే దగ్గరుండి ఓప్పించారనే న్యూస్ కూడా బయటకి వచ్చింది. నవంబరులో వీళ్ల పెళ్లి జరగబోతుందని తెలుస్తుంది. ఈ క్రమంలో నే చిరంజీవి..తన ఆస్తులను ముగ్గురు బిడ్డలకు సమానంగా వాట వేశారట. భవిష్యత్తులో ఎటువంటి గొడవ రాకుండా..శ్రీజ మళ్ళీ భర్త తో విడాకులు తీసుకున్న ..తను..తన పిల్లలు..హ్యాపీగా బ్రతికేలా ..ఆస్తులు ఇచ్చారనే టాక్ వైరల్ గా మారింది. ఏది ఏమైన చిరంజీవి పరువు తీస్తుంది శ్రీజ అంటున్నారు..మెగా అభిమానులు