Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శ్రీ రెడ్డి, ఆమె స్నేహితురాలు ట్రాన్స్ జెండర్ తమన్నా మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణని స్వయంగా తమన్నానే లీక్ చేయడం తెలిసిందే. అయితే నిన్న బయటకి వచ్చిన సంభాషణ అనేక కొత్త ప్రశ్నల్ని ప్రజల ముందుకు తెచ్చింది. ఈ లీకుల వ్యవహారం మీదనే అనేక అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. అసలు సురేష్ బాబు తో డబ్బులు ఇప్పిస్తానని ఆఫర్ చేస్తే శ్రీ రెడ్డి దానిని తిరస్కరించిందని అలా ఐదు కోట్ల ఆఫర్ తిరస్కరించడం గొప్ప విషయం అని రాంగోపాల్ వర్మ చెబుతున్నాడు, ఇది నిజమే అనుకుందాం అయితే మరి ఫోన్ సంభాషణలో దగ్గుబాటి అభిరాం పేరు ఎందుకు ప్రస్తావించలేదు. అసలు వర్మ చెప్పిన వీడియోలో తప్ప ఆ ఐదు కోట్లు ఇస్తానన్నది అభిరామ్ విషయంలో అని శ్రీరెడ్డి ఆడియో లో ఎక్కడా లేదు. అంటే ఇవి వర్మ పవన్ ని తిట్టినందుకు ఇప్పించాలని చూస్తే ఆ డబ్బులు ఆఫర్ చేసింది ఎవరు?
అలాగే వైయస్సార్ పార్టీ వాళ్లు స్కెచ్ వేశారు అని ప్రస్తావించింది. అసలు ఏమిటి ఆ స్కెచ్ ? ఆ పార్టీ తరఫున అసలు వీళ్లను ఎవరు సంప్రదించారు ? శ్రీ రెడ్డి ఆడియోలో టీడీపీ సపోర్ట్ అస్సలు లేదని, అలాగే వైయస్సార్ కాంగ్రెసు స్కెచ్ అని గట్టిగా చెప్పింది. అలా చెప్పాల్సిన అవసరమేంటి? ఉద్దేశపూర్వకంగా ఈ ఆడియో లీక్ చేసి సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారా? అనేది కూడా అనుమానించాల్సిన విషయమే. అంతే కాక ఆడియో చివరలో “అసలు పవన్ కళ్యాణ్ ఎలా బతుకుతారో చూస్తా, ఎలా గెలుస్తారో చూస్తా, అతని ఓటమి కోసం నా చివరి రక్తపుబొట్టు వరకూ పోరాడుతా అంటూ శ్రీరెడ్డి మాట్లాడటం మరిన్ని అనుమానాల్ని రేకెత్తిస్తోంది. అసలు పవన్ కళ్యాణ్ పై న శ్రీ రెడ్డి కి ఎందుకు అంత ద్వేషం? తనను అన్యాయం చేసిన దగ్గుబాటి అభిరాం లాంటి వాళ్లని వదిలేసి పవన్ ని ఎందుకు దూషించటం? ద్వేషించటం. వర్మ కూడా పబ్లిసిటీ కోసమే శ్రేరెడ్డి కి పవన్ ని తిట్టమని సలహా ఇచ్చానని చెబుతుంటే, శ్రీ రెడ్డి వ్యక్తిగత సంభాషణల్లో కూడా పవన్ ని దూషించడం ఎందుకు..
అలాగే ఆమె సంభాషణల మీద ఇంకా అనేక అనుమానాలున్నాయి. ఏంటంటే ఆ మాటల్లో ఎక్కడా కూడా ఫోన్లో మాట్లాడినట్లు క్యాజువల్ నెస్ లేదు, కాల్స్ లో ఎప్పుడు కలిగే డిస్టర్బెన్స్ లేదు, ఏదో కావాలని మాట్లాడినట్లు ఉంది. ఎక్కడా వాయిస్ ఓవర్ ల్యాప్ కానీ, ఒకరిమాటలకు మరొకరు పొరపాటునైనా అడ్డుతగలటం కానీ లేదు. చాలా పద్దతిగా ఒకరి డైలాగ్ అయ్యాక మరోకరి డైలాగ్ పర్ఫెక్ట్ గా మాట్లాడారు. ఇందులో వర్మ డబ్బుల విషయం బయట పెట్టడం కంటే ఈ గొడవ మొత్తానికి రాజకీయ రంగు పూయాలనే ఆలోచనతోనే శ్రీ రెడ్డి బ్యాచ్ ఉన్నట్లు అనిపిస్తోంది. ఏది ఏమయినా పోలీసులు కలగజేసుకుని ఈ విషయం మీద దర్యాప్తు జరపకపోతే మరిన్ని మలుపులు తిరిగి ఇంకెందరి మీద బురద చల్లుతారో తెలియని పరిస్థితి.