ఆ స్వామి కి బాబంటే కోపం, జగన్ అంటే ఇష్టం.

sri Swaroopananda swamy comments on chandrababu naidu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి కి. రాజకీయాలు మాట్లాడ్డం కొత్త కాదు. వైసీపీ అధినేత జగన్ కి ముహుర్తాలు, ఇతరత్రా సలహాలు ఇచ్చే ఈ స్వామి అదను దొరికినప్పుడల్లా టీడీపీ సర్కార్ మీద విమర్శలు చేస్తుంటారు. సరే స్వామిజి కదా అని ఎవరూ ఆయన విమర్శలకు కౌంటర్ ఇవ్వడం లేదు. అలాగని పెద్దగా పట్టించుకున్నదీ లేదు. దీన్ని అలుసుగా తీసుకున్న స్వరూపానంద ఈసారి శృతిమించి రాజకీయ విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని కులపిచ్చి పరిపాలిస్తోందని విశాఖలో జరిగిన పండిత మహా సమ్మేళనంలో స్వరూపానంద వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బూటు కాళ్లతో పూజలు చేస్తున్నా ఎవరూ నిలవరించలేకపోతున్నారని ఆవేదన చెందారు. బ్రాహ్మణ కార్పొరేషన్ పదవులు అన్నీ టీడీపీ కి అనుకూలంగా మాట్లాడేవారికి ఇస్తున్నారని స్వరూపానంద ఆరోపించారు. గతంలో తాను ఒక్క మాట అడగ్గానే దేవాలయాల ధూపదీప నైవేద్యాలు కోసం వై.ఎస్ నిధులు ఇచ్చారని , ఇప్పటి ప్రభుత్వం బ్రాహ్మణుల పట్ల చిన్నచూపు చూస్తోందని చెప్పుకొచ్చారు. ఇలా ఓ స్వామి ఈ స్థాయిలో రాజకీయం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. స్వామి వైఖరిని తప్పుబట్టే కొందరు ఆయనకు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు.

1 . వై.ఎస్ హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేయలేదు ?
2 . కనీసం ఆలోచన కూడా లేదు. ఇప్పుడు చంద్రబాబు స్వచ్చంధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వివిధ పద్ధతుల్లో బ్రాహ్మణులని ఆదుకుంటుంటే వారిని రెచ్చగొట్టడంలో ఉద్దేశం ఏంటి ?
. 3 . వై.ఎస్ ముఖ్య మంత్రిగా వున్నప్పుడు మీ మాట విన్నట్టు అయితే తిరుమల కొండలకు సంబంధించి వివాదాస్పద జీవో తెస్తుంటే మీరెందుకు మౌనంగా వున్నారు ?
4 . వై.ఎస్ హయాంలో క్యాబిఐనేట్ లో ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఎందరు ? ఇప్పుడు బాబు క్యాబినెట్ లో ఆయన సామాజిక వర్గ మంత్రులు ఎందరు ?
5 . నిజంగా కుల పిచ్చికి మీరు వ్యతిరేకం అయితే నాడు వై.ఎస్ ని ఎందుకు ప్రశ్నించలేదు?
6 . క్రైస్తవం పాటించే జగన్ తిరుమల వెళ్లి అక్కడ అన్య మతస్తులు సంతకం చేయాల్సిన చోట సంతకం పెట్టకుండా వచ్చినప్పుడు మీరెందుకు ప్రశ్నించలేదు ?
7 . అయినా మీరు చెప్పినట్టు విబేధానికి ఇది రాజరికం కాదు మీరు రాజగురువు కాదు. ఇది ప్రజాస్వామ్యం కదా ?
ఈ ప్రశ్నలకు స్వరూపానంద సమాధానం చెప్పినా , చెప్పకపోయినా ఆయన విశాఖ పండిత సమ్మేళనంలో మాట్లాడిన మాటల్లో చంద్రబాబు మీద కోపం , జగన్ మీద ఇష్టం బయటపడ్డాయి తప్ప అంతకన్నా జరిగేది , ఒరిగేది ఏమీ లేదు.