యవ్వ‌నం కోసం ఇంజెక్ష‌న్ల‌పై స్పందించిన శ్రీదేవి

Sridevi comments on using Injection to stay young

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
శ్రీదేవి మ‌ర‌ణ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన ద‌గ్గ‌ర‌నుంచి సోష‌ల్ మీడియా మొత్తం ఆమె గురించే చ‌ర్చించుకుంటోంది. ఆమె ఫొటోలు, వీడియోలు, ఇంట‌ర్వ్యూల‌ను షేర్ చేసుకుంటూ అతిలోకసుంద‌రి జ్ఞాప‌కాల్లో మునిగితేలుతున్నారు నెటిజ‌న్లు. ఆమె ఫొటోలు, వీడియోలు నెట్ లో వైర‌ల్ గా మారాయి. అలాంటి వాటిలో రూప్ కీ రాణీ స‌మ‌యంలో శ్రీదేవి ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూకు సంబంధించిన వీడియో ఒక‌టి. ప‌లు ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌ల‌కు శ్రీదేవి ఇందులో స‌మాధాన‌మిచ్చారు. మీరు నిత్యం య‌వ్వ‌నంగా ఉండేందుకు ఏమైనా ఇంజక్ష‌న్లు తీసుకుంటారా..?

మీ అభిమానులు అలా అనుకుంటున్నారు అని జ‌ర్న‌లిస్ట్ ప్ర‌శ్నించ‌గా… జ‌న‌మంతా అలా ఎందుక‌నుకుంటారో తెలియ‌ద‌ని, తానైతే ఎలాంటి ఇంజ‌క్ష‌న్లు తీసుకోన‌ని శ్రీదేవి స‌మాధాన‌మిచ్చారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇన్నేళ్లు విజ‌య‌వంతంగా ఉండ‌డానికి కార‌ణం అదృష్ట‌మా అని అడ‌గ్గా… ల‌క్ కార‌ణమ‌ని తాను అనుకోవ‌డం లేద‌ని, ల‌క్ పైన మాత్ర‌మే న‌మ్మ‌కం పెట్టుకోన‌ని, ఒక వ్య‌క్తిలో ఉన్న అన్ని ర‌కాల టాలెంట్లు గుర్తించి ఇంప్రూవ్ చేసుకోవాల‌ని శ్రీదేవి వ్యాఖ్యానించారు. పెళ్లిపైన కూడా శ్రీదేవి త‌న‌ అభిప్రాయం తెలియ‌జేశారు. మీరు ప్రేమ వివాహం చేసుకుంటారా… లేక పెద్ద‌లు కుద‌ర్చిన పెళ్లిచేసుకుంటారా… అంటే ఆ విష‌యాలు త‌న త‌ల్లి చూసుకుంటార‌ని, త‌న‌కు మాత్రం పెద్ద‌లు కుదిర్చిన వివాహ‌మే ఇష్ట‌మ‌ని అప్ప‌ట్లో చెప్పిన శ్రీదేవి త‌ర్వాతి కాలంలో బోనీక‌పూర్ ను ప్రేమించి పెళ్లిచేసుకోవ‌డం విశేషం.