దొరసానిని దేవరకొండ కిస్ చేశాడా ? అది బెడ్ రూమ్‌లో చేసే పనేగా జీవితా ?

srireddy comments on dorasani movie

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, జీవిత రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ డెబ్యూ మూవీ ‘దొరసాని’ శుక్రవారం నాడు (జూలై 12) విడుదలై పాజిటివ్ రెస్పాన్స్‌ని రాబట్టింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ప్యూర్ లవ్ స్టోరీని తెరకెక్కించారు దర్శకుడు కేవీఆర్ మహేంద్ర. కానీ దొరసాని సినిమాను టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేసింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. శివాత్మిక తల్లి జీవితతో ఉన్న పాత వైరాన్ని గుర్తు చేసుకుని గతంలో ఇండస్ట్రీకి సంబంధించి జీవిత చేసిన కామెంట్స్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది శ్రీరెడ్డి. ఈ సందర్భంగా.. ‘సినిమాల్లో లిప్ లాక్‌లు ఒకరి మీద ఒకరు పడటాలు ఎక్కువైపోతున్నాయి బెడ్ రూంలో చేయాల్సిన పనులు రోడ్ మీద చేస్తామా’ అంటూ జీవిత చేసిన కామెంట్స్‌ని గుర్తు చేస్తూ నాటి వీడియోను షేర్ చేసింది. ‘జీవిత గారూ ఇది మీకు గుర్తుందా’ అంటూ ఈ వీడియో వదిలింది శ్రీరెడ్డి. మరోపోస్ట్‌లో ‘దొరసాని’ సినిమా హిట్టా? ఫ్లాపా? శివాత్మిక రాజశేఖర్‌ని కిస్ చేశాడట ఆనంద్ దేవరకొండ. ఈ టాపిక్‌పై ఫేస్ బుక్‌ లైవ్‌లోకి వస్తున్నా అంటూ పోస్ట్ వదిలింది శ్రీరెడ్డి. ‘జీవిత గారు నీ కూతురు దగ్గరకి వచ్చేసరికి ఎన్ని పత్తిత్తు కబుర్లు చెప్తున్నారో ఒకసారి తవ్వుకుందాం .. మీరెలాగూ మూవీ అసోషియేషన్ కార్డుకి అడ్డం పడుతున్నారని తెల్సు.. స్టిల్ మాట్లాడతా’ అంటూ సంచలన కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి.

Dhorasani cinema hit ? Flopa??kiss chesada devarakonda??about this topic only live wl be

Publiée par Sri Reddy sur Samedi 13 juillet 2019