భార్యతో గేట్లు ఎత్తించిన జలవనరుల శాఖ ఇంఛార్జ్‌ !

భార్యతో గేట్లు ఎత్తించిన జలవనరుల శాఖ ఇంఛార్జ్‌ !

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం పెరుగుతోంది. ఇన్ ఫ్లో పెరగడంతో గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. 3 లక్షల 73 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 2 లక్షల 72 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి వరద ప్రవాహం ఎక్కువ కావడంతో శ్రీశైలం గేట్లు ఎత్తారు.  అయితే అధికారుల తీరు మాత్రం విమర్శల పాలు చేస్తోంది. వాస్తవానికి ఇంజనీరింగ్‌ అధికారులు గేట్లు ఎత్తే పని చేయాలి. కానీ ఇక్కడ పనిచేస్తున్న జలవనరుల శాఖ ఇంఛార్జ్‌ సూపరెంటెండెంట్‌  శ్రీనివాసరెడ్డి తన భార్యతో గేట్లు ఎత్తించడం చర్చనీయాంశం అయింది.  ఈ వ్యవహారంపై కొందరు అధికారులే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. భార్య చేత శ్రీనివాసరెడ్డి ఎలా గేట్లు ఎత్తిస్తారని మండిపడుతున్నారు.