బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తాజాగా వినాయక చతుర్ది సందర్బంగా తన కొడుకు గణేష విగ్రహం ముందు నమస్కారం పెడుతూ, ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోను పోస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఆ ఫొటోకు కామెంట్‌గా మా ఇంట్లో గణేష్ అంటూ షారుఖ్ ఖాన్ పోస్ట్ చేయడంతో ఇప్పుడు ముస్లీంలు షారుఖ్ ఖాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. ముస్లీంలు విగ్రహ ఆరాధనకు పూర్తి వ్యతిరేకం. అయినా కూడా నువ్వు విగ్రహాన్ని ఆరాధించడం ఏంటీ అంటూ ఆగ్రహంతో ముస్లీం మతానికి చెందిన పలువురు సోషల్ మీడియాలో షారుఖ్‌ను టార్గెట్ చేస్తున్నారు.
షారుఖ్ చిన్న కొడుకు అబ్ రామ్ వినాయకుడి ముందు ఉన్న ఫొటో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. అందుకే ముస్లీంలు ఈ విషయమై షారుఖ్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలోనే కాకుండా ముస్లీం పెద్దలు కూడా ఈ విషయమై షారుఖ్‌ను వివరణ అడిగేందుకు సిద్దం అవుతున్నారు. సోషల్ మీడియాలో షారుఖ్ చేసిన పోస్ట్ వివాదం రేపుతున్న సమయంలో హిందువులు మాత్రం ఆయన్ను మరింతగా అభిమానిస్తున్నారు. నీలాంటి హీరోలు ఇండియాకు చాలా అవసరం అంటూ చెప్పుకొచ్చారు. పూజలు వద్దని ముస్లీం ప్రవక్త చెబుతున్న నేపథ్యంలో ఇలా నువ్వు చేయడం ఏంటీ అంటూ ముస్లీంలు మాత్రం పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో షారుఖ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.