మహేష్‌, సుక్కూ మూవీలో మరో స్టార్‌ హీరో??

star hero to play a guest role in mahesh babu sukumar movie

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘1’ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో మరో సినిమాకు రంగం సిద్దం అవుతుంది.రంగస్థలం చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ను దక్కించుకున్న దర్శకుడు సుకుమార్‌ తాజాగా మహేష్‌బాబుతో సినిమాకు సిద్దం అవుతున్నాడు. భారీ ఎత్తున ఒక స్క్రిప్ట్‌ను దర్శకుడు రెడీ చేస్తున్నాడు. ఇక మహేష్‌బాబు 25వ చిత్రం ‘మహర్షి’ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మహేష్‌ బాబు 26వ చిత్రంగా సుకుమార్‌ దర్శకత్వంలో సినిమా తెరకెక్కబోతుంది. ఈ చిత్రం షూటింగ్‌ను దసరా తర్వాత ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్న సుకుమార్‌ త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెళ్లడి చేయబోతున్నాడు.

mahesh-babu

సినిమాకు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. మహేష్‌ 25వ చిత్రం మహర్షిలో అల్లరి నరేష్‌ ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక మహేష్‌ 26వ చిత్రంలో కూడా ఒక హీరో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. మహేష్‌బాబుకు సరి జోడీ అయిన ఒక స్టార్‌ హీరోతో సుకుమార్‌ చర్చించబోతున్నాడు. సినిమాలో దాదాపు 10 నుండి 15 నిమిషాల పాటు ఆ హీరో కనిపించబోతున్నాడు. రామ్‌ చరణ్‌ లేదా ప్రభాస్‌ల్లో ఒకరు మహేష్‌ 26వ చిత్రంలో గెస్ట్‌గా కనిపించడం ఖాయంగా కనిపిస్తుంది. వీరిద్దరిలో ఎవరు నటించినా కూడా సినిమా స్థాయి రెట్టింపు అవ్వడం ఖాయం. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో చూడాలి.

mahesh-babu-and-sukumarmahesh-babu-and-sukumar