బిగ్‌బాస్‌ హౌస్‌మెంట్స్‌ పారితోషికాలు ఎంతో తెలుసా?

star maa offering 30 lakhs remuneration for NTR big boss Show contestants

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షోకు మంచి స్పందన వస్తుంది. తెలుగు ప్రేక్షకులు ఈ షోను ఆధరిస్తున్న తీరుతో స్టార్‌ మా వారు ఆనందంను వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మంచి టీఆర్పీ రేటింగ్‌ వస్తుంది. భారీ బడ్జెట్‌తో ఇప్పటి వరకు ఏ తెలుగు ఛానల్‌ కూడా చేయని విధంగా ఈ షోను స్టార్‌ మా వారు ప్లాన్‌ చేయడం జరిగింది. ఈ షోకు ఎన్టీఆర్‌ తీసుకునే పారితోషికం కోట్లల్లో ఉందనే ప్రచారం జరుగుతుంది. వారంలో రెండు రోజులు మాత్రమే ఎన్టీఆర్‌ షోలో కనిపిస్తాడు. వారంకు 30 లక్షల చొప్పున తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 

ఇక ఇతర పార్టీసిపెంట్స్‌ కూడా భారీగా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉంటున్నందుకు పారితోషికంగా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. హౌస్‌లో ఉంటున్న అందరిలోకి సంపూర్నేష్‌బాబు ఎక్కువ ఫేమస్‌. అందుకే ఆయన వారంకు ఏకంగా 10 లక్షల రూపాయల పారితోషికాన్ని అందుకుంటున్నట్లుగా నిర్వాహకుల ద్వారా తెలుస్తోంది. ఇక ఆయన తర్వాత ముమైత్‌ ఖాన్‌, ధన్‌రాజ్‌, శివబాలాజీ, సమీర్‌, ఆదర్ష్‌లు 7.5 లక్షల పారితోషికాన్ని అందుకుంటున్నారు. మధుప్రియ, కల్పన, అర్చనలు 5 లక్షల పారితోషికంగా అందుకుంటున్నారు. మిగిలిన వారిలో కొందరు రెండు లక్షలు, కొందరు మూడు లక్షలు, కొందరు నాలుగు లక్షలు కూడా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వారంకు ఒకరు ఎలిమినేట్‌ అవుతారు కనుక వారం వారం అన్నట్లుగా రెమ్యూనరేషన్‌ను ఫిక్స్‌ చేసినట్లుగా తెలుస్తోంది. చివరి వరకు ఎవరైతే ఉంటారో వారు ఎక్కువ పారితోషికం అందుకునే అవకాశం ఉంది. చివరి మూడు లేదా నాలుగు వారాల్లో ఉన్న వారికి అందరికి సమానమైన పారితోషికం అందించనున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఫైనల్‌లో గెలిచిన వారికి భారీ ప్రైజ్‌ మనీ కూడా అందించనున్నట్లుగా చెబుతున్నారు.

మరిన్ని వార్తలు

పిక్‌టాక్‌: బాహుబలి నుండి బయట పడ్డట్లే

మంచు వారి ఇంటకి మరో బుజ్జాయి