మద్యం కోసం వింత పాట్లు… మినిరల్ వాటర్ కాటన్లలో బీర్లు కుక్కేసి..

ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా వైరస్. ఈ వైరస్ ను అంతం చేసేందుకు ప్రపంచ దేశాలన్ని నానా పాట్లు పడుతుంది. కాగా ఈ వైరస్ ను ధీటుగా ఎదుర్కొనేందుకు పలు దేశాలు లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. అయితే కొంద‌రు అక్ర‌మార్కులు లాక్‌డౌన్ సమయంలో ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఉల్లంఘిస్తున్నారు.

అదేలాగంటే… దేశ‌వ్యాప్తంగా వ‌చ్చేనెల 3వ‌ర‌కు లాక్‌డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. అత్య‌వ‌స‌ర స‌ర్వీస‌లు మిన‌హా మిగ‌తా అన్ని కార్యాల‌యాలు, దుకాణాలను మూసివేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. అయితే అత్య‌వ‌స‌ర సేవ‌ల్లోని కొంద‌రు వ్యక్తులు అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌లో ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. న‌గ‌రంలోని మెడికల్ షాప్ ఓన‌ర్‌.. మ‌ద్యాన్నిఅక్రమంగా అమ్మి అడ్డంగా బుక్క‌య్యాడు.

తాజాగా పోలీసులు అత‌ని దుకాణంపై దాడిచేశారు. వెంటనే ఓన‌ర్‌ ను అరెస్ట్ చేశారు. ఇక మ‌ద్యం స‌ర‌ఫ‌రా కోసం స‌ద‌రు మెడిక‌ల్ షాప్ ఓన‌ర్ అతి తెలివి ప్ర‌ద‌ర్శించాడు. షాపులోని మిన‌ర‌ల్ బాటిల్ కాట‌న్ల‌లో బీరు బాటిళ్లు దాచాడు. మందు బాబుల‌కు గుట్టుచప్పుడుగా వీటిని అధిక ధ‌ర‌ల‌కు అమ్మి కావలసినంతం సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించాడు. ఈ విషయంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు షాపును సీజ్ చేశారు. ఐపీసీలోని వివిధ సెక్ష‌న్ల ప్ర‌కారం కేసుల‌ను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా హ‌ర్యానాలో కూడా అత్య‌వ‌స‌ర సేవ‌ల్లోని సిబ్బంది ఒక‌రు ఇలాగే అతి తెలివిని ప్ర‌ద‌ర్శించాడు. అంబులెన్స్‌లో కొంత‌మందిని ఎక్కించుకుని.. హ‌ర్యానా నుంచి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు బ‌య‌ల్దేరాడు. మార్గ‌మాధ్యంలో పోలీసుల త‌నిఖీల్లో అడ్డంగా దొరికిపోయిన ఘటనలు ఎన్నో కోకొల్లలుగా వెలుగు చూస్తున్నాయి.