దేశ వ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు దారుణంగా పెరుగుతుండడంతో దేశ వ్యాప్తంగా అమలు చేసిన లాక్ డౌన్ ని పొడిగిస్తూ ప్రధాని మోడీ కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ బీబత్సంగా విస్తరిస్తున్న తరుణంలో కరోనా వైరస్ నివారణకై రాష్ట్రంలో లాక్ డౌన్ ని చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కొన్నిప్రాంతాల్లో ఇప్పటివరకు కూడా ఎలాంటి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. కాగా ఆ ప్రాంతాల్లో ఈ నెల 20 నుండి లాక్ డౌన్ ని సడలించనున్నారని వార్తలు వస్తున్నాయి.
కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో ఎక్కడా కూడా ‘లాక్ డౌన్ ని సడలించేది లేదని కీలకమైన నిర్ణయాన్ని తీసుకుందని సమాచారం. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మినహాయింపుల అమలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసిందని సమాచారం. ఎందుకంటే లాక్ డౌన్ ని సడలించడం వలన ప్రజలు ఇష్టారీతిలో తిరుగుతూ, వైరస్ వ్యాప్తికి కారణమవుతారని, అందుకనే ఎట్టిపరిస్థితుల్లోనూ లాక్ డౌన్ ని సడలించే అవకాశం లేదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుందట. కాగా ఈనెల 19న జరగబోయే కేబినెట్ భేటీలో ఈ లాక్ డౌన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకోనుందని సమాచారం.