రాజధాని అమరావతిలో తీవ్రస్థాయిలో నిరసనలు

రాజధాని అమరావతిలో తీవ్రస్థాయిలో నిరసనలు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మూడు రాజధానిల ప్రకటన చేసినప్పటి నుంచి రాజధాని అమరావతిలో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులందరూ రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. రోజు రోజు కు రాజధాని రైతులు చేపడుతున్న నిరసనలు ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి. దీంతో అమరావతి మొత్తం అట్టుడికిపోతోంది. అయితే అమరావతి రైతులే కాకుండా రైతు కుటుంబీకులు కూడా వచ్చి నిరసనలు తెలుపుతుండటంతో అమరావతి మొత్తం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

అంతేకాకుండా అటు నిరసనకారులను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం కూడా జరుగుతుంది. కాగా రోజురోజుకు రాజధాని తరలింపునకు వ్యతిరేకిస్తూ అమరావతిలో జరుగుతున్న ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి. అయితే నిన్న రాజధాని తరలింపు ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసుల దౌర్జన్యం పాల్గొనడాన్ని నిరసిస్తూ ఈరోజు అమరావతి వ్యాప్తంగా బంద్ జరుగుతోంది. ఈరోజు జేఏసీ ఇచ్చిన పిలుపుతో ఉదయంనుంచే మందడంలో బంద్ కొనసాగుతోంది. రైతులు ఉదయాన్నే రోడ్లపైకి చేరుకుని నిరసనలకు దిగారు. దీంతో మందడం లో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఇక బందోబస్తు నిర్వహించేందుకు వచ్చిన పోలీసులకు కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వకూడదని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా గ్రామంలోని దుకాణాల వద్ద కూడా పోలీసులు కూర్చోవడానికి వీలు లేదు అంటూ మందడం రైతులు అందరూ తెగేసి చెప్పారు. గ్రామంలోకి వెళ్లకుండా పోలీసులు వాహనాలను అడ్డుకునే వెనక్కి పంపించేశారు రైతులు. దీంతో పోలీసులు రైతులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఇక బంద్ చేపట్టిన రైతులందరూ రోడ్ల మీదకు చేరుకోవడంతో వాహనాల రాకపోకలు మొత్తం స్తంభించిపోయింది. ఈ క్రమంలో అమరావతి లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చోటు చేసుకునే అవకాశం ఉంది. దీంతో అంతా హాట్ హాట్ వాతావరణం నెలకొంది.