కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ధార్వాడలో వెలుగు చూసింది. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ధార్వాడలోని ఓ ప్రాంతానికి చెందిన కళాశాల విద్యార్థిని అదే ప్రాంతానికి చెందిన ఐదుగురు యువకులు మాయమాటలు చెప్పి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారని ధార్వాడ టౌన్ పోలీసులు తెలిపారు.