జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ కరోనా బారిన పడ్డారని తెలుస్తోంది. ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురైన ఆయనకు కోవిడ్ టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలినట్లు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయాన్ని సుధీర్ కన్ఫర్మ్ చేయనప్పటికీ.. గత రెండు మూడు రోజులుగా సుధీర్‌ని కరోనా కాటేసిందనే వార్తలు షికారు చేస్తున్నాయి.
లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా షూటింగ్స్‌కి అనుమతి వచ్చినప్పటి నుంచి యమ యాక్టివ్‌గా తన టీవీ, సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నారు సుడిగాలి సుధీర్. ముఖ్యంగా టీవీ షోస్ ద్వారా ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతున్నారు. ఇక పండగ వచ్చిందంటే సుధీర్ కనిపించని ఇల్లే ఉండదు. ఈ క్రమంలోనే ఈ సారి దసరా కోసం ‘అక్కా ఎవడే అతగాడు’ స్పెషల్ ప్రోగ్రాం షూట్ చేశారు. ఇందులో రష్మీ, వర్షిణి, శేఖర్ మాస్టర్, సంగీత అంతా కలిసి రచ్చ చేస్తూ చిందులేశారు. ప్రస్తుతం ఈ షో తాలూకు ప్రోమో వీడియోలు సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నాయి.