తెలంగాణలోని వికారాబాద్ లో ఘోరం చోటుచేసుకుంది. రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా భోజనం చేసిన సర్పంచ్ ఉదయం శవమై పడి ఉన్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా చన్గోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
అయితే పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని కొత్తపల్లికి చెందిన కావలి ఆనందం (35) గత ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలిచాడు. గత కొంతకాలంగా తీవ్ర మనోవేదన, అనారోగ్యంతో బాధపడుతున్న ఆనందం మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశాడు. ఆ తర్వాత తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. కానీ.. ఉదయం తెల్లవారినా ఎంతసేపటికీ లేవకపోవడంతో నిద్రపోతూ ఉండవచ్చని భావించిన అతడి సోదరుడు శ్రీహరి పొలానికి వెళ్లిపోయాడు.