సుజీత్ షార్ట్ ఫిలింమేకర్‌గా చాలా టాలెంట్ చూపించాడు. మొదటి సినిమా రన్ రాజా రన్‌తో కూడా హిట్ కొట్టాడు. ప్రేక్షకులకి కావాల్సిన వినోదాన్ని కొత్తగా అందించడంలో అతను సిద్ధహస్తుడు. అయితే అతనిపై పాపం ‘బాహుబలి’ అంత భారాన్ని మోపి ‘సాహో’తో వయసుకి, సామర్ధ్యానికి, అనుభవానికి మించిన బాధ్యత మోపారు. దాంతో అతను సాహోకి తడబడ్డాడు. అతని అనుభవరాహిత్యం వల్ల సాహో ఫ్లాపయింది.
అయితే తనేదో క్రిస్టఫర్ నొలాన్ తరహాలో క్లిష్టమైన స్క్రీన్‌ప్లే రాస్తే క్రిటిక్స్‌కి కూడా అర్థం కాలేదన్నట్టు చెప్పుకున్నాడు. ఏదేమైనా సాహో ఫ్లాప్ అయిన తర్వాత ఈ కుర్రాడు బయటెక్కడా కనిపించడం లేదు. కాన్ఫిడెన్స్‌ని దెబ్బ తీసే అలాంటి పరాజయం నుంచి కోలుకోవాలంటే అతనికి సాహో నిర్మాతలే వెన్నుదన్నుగా నిలబడాలి.
అతని వల్ల కాదని భయపడినా కానీ సాహో లాంటి చిత్రాన్ని అతని చేతిలో పెట్టిన ప్రభాస్, అతని స్నేహితులైన యువి క్రియేషన్స్ వాళ్లు సుజీత్‌కి ముచ్చటగా మూడవ అవకాశాన్ని ఇస్తారా? ఈసారి ప్రభాస్‌లాంటి స్టార్‌ని కాకుండా ఒక చిన్న సినిమా తీసుకుని, పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి ప్రోదిచేసుకునే ఛాన్స్ ఇస్తారా? బయటి బ్యానర్ల కంటే ఇప్పుడు అతనికి యువి క్రియేషన్స్ నుంచే చేయూత అవసరం. ఒకవైపు వాళ్లే ప్రెజర్లో వున్నపుడు సుజీత్ గురించి ఎలా పట్టించుకుంటారనే వాళ్లూ వున్నారనుకోండి.