ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు వెరీ గుడ్‌ న్యూస్‌…!

Prabhas Radha Krishna Movie Title JAAN

తాను చేసిన ప్రతి సినిమాతో మంచి సక్సెస్‌లను అందుకోవడం లేదంటే విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడం చేసిన సుకుమార్‌ తాజాగా రామ్‌ చరణ్‌తో ‘రంగస్థలం’ చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. రంగస్థలం చిత్రం ఇండస్ట్రీ హిట్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. రికార్డు స్థాయి వసూళ్లను సాధించిన ఆ చిత్రం తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు ఒక చిత్రం చేసేందుకు సిద్దం అవుతున్నాడు. సుకుమార్‌ దర్శకత్వంలో ప్రస్తుతం స్టార్‌ హీరోలు అంతా కూడా నటించేందుకు చాలా ఆసక్తిని కనబర్చుతున్నారు. ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత స్థానంలో సుకుమార్‌ నిలిచాడు అంటూ టాక్‌ వినిపిస్తుంది. అలాంటి సుకుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ఒక చిత్రం తెరకెక్కబోతుంది.

prabash

ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో సాహో చిత్రం తెరకెక్కుతోంది. ఆ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తి కాబోతుంది. మరో వైపు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలు కూడా 2019లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలను కూడా యూవీ క్రియేషన్స్‌ వారు నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ మూవీ ఉంటుందని సమాచారం అందుతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట. మహేష్‌తో మూవీ పూర్తి చేసి ప్రభాస్‌ కోసం మూవీ కథను సిద్దం చేయాలని సుకుమార్‌ భావిస్తున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ప్రభాస్‌, సుకుమార్‌ల కాంబో మూవీ 2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సుకుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ మూవీ అంటే ఫ్యాన్స్‌కు పెద్ద గుడ్‌ న్యూస్‌ అని చెప్పుకోవచ్చు.

Sukumar-Next-Movie-With-Pra