Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లను దక్కించుకున్న దర్శకుడు సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని మహేష్‌బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో మహేష్‌బాబు, సుకుమార్‌ల కాంబినేషన్లో సినిమా తెరకెక్కబోతుంది. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఆ చిత్రం కోసం సుకుమార్ ఏకంగా 20 కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వరుసగా రెండు సూపర్ హిట్‌తో పాటు మహేష్‌బాబుతో సినిమా అవ్వడం వల్ల కాస్త ఎక్కువ పారితోషికంను ఈయనకు నిర్మాతలు ముట్టజెప్పినట్లుగా తెలుస్తోంది.
‘రంగస్థలం’ చిత్రం కోసం నిర్మాత దానయ్య దర్శకుడు సుకుమార్‌కు 12.5 కోట్ల మేరకు చెల్లించి ఉంటాడని తెలుస్తోంది. సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో 2.5 కోట్లు అదనంగా దర్వకుడు దక్కించుకున్నాడు. అంటే మొత్తంగా రంగస్థలం చిత్రంకు గాను దర్శకుడు సుకుమార్ 15 కోట్ల వరకు తీసుకున్నాడు. ఇప్పుడు మహేష్‌బాబు 26వ చిత్రానికి ఏకంగా 20 కోట్లు తీసుకోబోతున్నాడు. సినిమా సక్సెస్ అయితే గుడ్‌విల్‌గా మరో అయిదు కోట్లు కూడా ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న దర్శకుల్లో రాజమౌళి 30 కోట్లతో టాప్‌లో ఉండగా, కొరటాల శివ 25 కోట్లతో రెండవ స్థానంలో నిలిచాడు. మూడవ స్థానంలో సుకుమార్ ఉన్నాడు. మహేష్‌బాబుతో చేయబోతున్న సినిమా సూపర్ హిట్ అయితే రెండవ స్థానంను కొరటాల ఆక్రమించినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.