గొల్లభామపై సుక్కు క్లారిటీ

Sukumar responds on Golla Bhama word Controversy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రంలోని రంగమ్మా మంగమ్మా… అనే పాట వివాదాస్పదం అవుతున్న విషయం తెల్సిందే. యాదవ సంఘం నాయకులు పలువురు ఆ పాటలోని గొల్లభామ వచ్చి నా గోరుగిల్లుతుంటే… అనే చరణం తమను అవమానించే విధంగా ఉందని, తమ ఆడవారిని కించపర్చేలా ఉన్న ఆ పదాలను వెంటనే తొలగించాల్సిందే అటూ రాములు యాదవ్‌ డిమాండ్‌ చేశారు. యాదవ సంఘం నాయకుల విమర్శలపై తాజాగా దర్శకుడు సుకుమార్‌ మీడియా సమావేశంలో స్పందించాడు. ఈ వివాదంకు ఒక ఫుల్‌స్టాప్‌ పెట్టాడు.

పాటలో తాము ఉపయోగించిన గొల్లభామ అనే పదం మనుషులకు సంబంధించినది కాదని, అదో కీటకంకు సంబంధించిన పదం అని, గొల్లభామ అనే కీటకం ఉంటుందని, ఆ కీటకంను ఉపయోగించి రచయిత ఆ పద ప్రయోగం చేశాడు అంటూ సుకుమార్‌ చెప్పుకొచ్చాడు. సుకుమార్‌ వివరణతో యాదవ సంఘం నాయకులు తృప్తి చెందుతారా లేదంటే వివాదంను రాద్దాంతం చేస్తారా అనేది చూడాలి. ఈనెల 18న రంగస్థలం ప్రీ రిలీజ్‌ వేడుకను వైజాగ్‌లో నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రీ రిలీజ్‌ వేడుక కోసం విలేజ్‌ సిట్టింగ్‌ను బీచ్‌లో వేస్తున్నట్లుగా నిర్వహకులు పేర్కొన్నారు. సమంత ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా ఉన్నారు. పూర్తి పల్లెటూరు బ్యాక్‌డ్రాప్‌లోనే ఈ చిత్రం ఉంటుందని టీజర్‌ మరియు పాటలు చూస్తుంటే అర్థం అవుతుంది.