సుమంత్‌ ఇన్ని సినిమాలు చేశాడా?

Sumanth starts 25 movie on march 18

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అక్కినేని ఫ్యామిలీ నుండి నాగేశ్వరరావు వారసులుగా నాగార్జునతో పాటు చాలా సంవత్సరాల క్రితమే సుమంత్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నాగార్జున స్టార్‌ హీరోగా దూసుకు పోతున్న సమయంలో సుమంత్‌ ఎంట్రీ ఇవ్వడం, ఈయనకు తాత మరియు మామలు సపోర్ట్‌గా నిలవడంతో సుమంత్‌ కూడా టాలీవుడ్‌లో ఒక స్టార్‌ హీరోగా పేరు తెచ్చుకోవడం ఖాయం అని అంతా భావించారు. అయితే ఇండస్ట్రీలో బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్నంత మాత్రాన స్టార్స్‌ అవ్వరు అని సుమంత్‌ నిరూపించాడు. టాలీవుడ్‌లో దిగ్గజాలు అయిన వారి మద్దతు ఉన్నా కూడా సుమంత్‌ ఎదగలేక పోయాడు. ఇప్పటి వరకు సుమంత్‌ చేసిన చిత్రాల్లో సక్సెస్‌ అయినవి ఏంటీ అంటే ఠక్కున చెప్పలేని పరిస్థితి నెలకొంది.

సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్న సుమంత్‌ ఇప్పటి వరకు పది పదిహేను సినిమాలు చేసి ఉంటాడు అని ఇప్పటి వరకు అంతా అనుకుని ఉంటారు. కాని సుమంత్‌ తన 24 చిత్రాలను పూర్తి చేసుకుని 25వ చిత్రంతో సిద్దం అవుతున్నాడు. మ్యాజిక్‌ ఫిగర్‌ మూవీ అవ్వడంతో సుమంత్‌ చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, ప్రత్యేకంగా కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

సుమంత్‌ 25వ సినిమా అనగానే ప్రేక్షకులు మాత్రమే కాకుండా సినీ వర్గాల వారు కూడా బాబోయ్‌ అప్పుడే సుమంత్‌ 24 చిత్రాలు చేశాడా అంటూ నోరెళ్లబెడుతున్నారు. సినిమాలు చేసినవన్ని కూడా ఫట్‌ ఫట్‌ మనడంతో ఇంత సంఖ్య చేరాడని ఎవరు భావించలేదు. మ్యాజిక్‌ నెంబర్‌ చిత్రం అయినా సుమంత్‌కు సక్సెస్‌ను తెచ్చి పెట్టి ఇకపై అయినా సుమంత్‌ కెరీర్‌ సాఫీగా సాగుతుందేమో చూడాలి.