Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘రంగస్థలం’ చిత్రంతో రామ్ చరణ్‌కు కెరీర్ బెస్ట్ సక్సెస్‌ను అందించిన దర్శకుడు సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని మహేష్‌బాబు హీరోగా చేయబోతున్న విషయం తెల్సిందే. మహేష్‌బాబు 25వ చిత్రంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. మహేష్ బాబు 26వ చిత్రంగా సుకుమార్ దర్శకత్వంలో సినిమా రాబోతుంది. మహేష్‌బాబు 26వ సినిమాను మైత్రి మూవీస్ వారు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రికార్డు స్థాయి బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. విదేశాల్లో ఎక్కువగా షూటింగ్స్ చేసే దర్శకుడు సుకుమార్ రంగస్థలం మాత్రం పూర్తిగా పల్లెటూరు నేపథ్యంలో తెరకెక్కించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక మహేష్‌బాబుతో చేయబోతున్న సినిమాను తన గత చిత్రాల మాదిరిగా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఈ చిత్రం కోసం సుకుమార్ తీసుకుంటున్న పారితోషికం చర్చనీయాంశం అవుతుంది.
ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కించబోతున్న మల్టీస్టారర్ చిత్రానికి గాను పారితోషికంగా 20 కోట్లు మరియు లాభాల్లో వాటాను తీసుకుంటున్నాడు. జక్కన్న దారిలోనే ఇప్పటికే కొరటాల శివ కూడా లాభాల్లో వాటాను పారితోషికంగా తీసుకుంటున్నాడు. తాజాగా సుకుమార్ కూడా అదే పద్దతిని ఫాలో అవుతున్నాడు. మహేష్‌బాబు 26వ సినిమాకు సుకుమార్ 18 కోట్ల పారితోషికంతో పాటు లాభాల్లో వాటాను మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది. సినిమా మినిమం సక్సెస్ అయినా కూడా లాభాల్లో వాటా రూపంలో 5 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఇక రంగస్థలం మాదిరిగా భారీ విజయాన్ని సాధిస్తే 10 నుండి 15 కోట్ల మేరకు లాభాల్లో వాట సుకుమార్ పారితోషికంగా అందుకుంటాడని సమాచారం అందుతుంది. మొత్తంగా మినిమం 30 కోట్లను మహేష్ సినిమా ద్వారా సుకుమార్ తన ఖాతాలో వేసుకుంటాడనే టాక్ వినిపిస్తుంది.