కోలీవుడ్ స్టార్ హీరో సుకుమార్ తన సినిమాల్లో చాలా విభిన్నంగా కథను నడిపిస్తాడు. అద్బుతమైన టేకింగ్‌తో మంచి కథతో సుకుమార్ సినిమాలను తెరకెక్కిస్తాడు. కొత్తగా ఆలోచించడం సుకుమార్‌కే చెల్లుతుంది. తాజాగా సుకుమార్ భార్య కూడా చాలా విభిన్నంగా ఆలోచించి ఒక బిజినెస్‌ను ప్రారంభించారు. ఆమె లాండ్రీ బిజినెస్‌ను ప్రారంభించి అందరిని ఆశ్చర్య పర్చింది. స్టార్ డైరెక్టర్ భార్య ల్యాండ్రీ బిజినెస్ అంటే ఆ స్థాయిలోనే ఉంటుంది. లాండ్రీ అనగానే చీప్‌గా చూడకండి. లక్షల్లో వ్యాపారమట. ఇప్పటికే పలు ఏరియాల్లో బ్రాంచ్‌లు ఏర్పాటు చేసిన తబిత గారు త్వరలోనే తమ బ్రాంచ్‌లను పెంచబోతున్నట్లుగా చెబుతున్నారు. సుకుమార్ సినిమాలతో బిజీ అయితే ఆయన భార్య తబిత ఇలా లాండ్రీ వ్యాపారంతో బిజీ అయ్యింది.
ఈమద్య కాలంలో హీరోు, దర్శకులతో పాటు వారి భార్యలు కూడా బిజినెస్‌లలో రాణిస్తున్నారు. గతంలో హీరోల భార్యలు అంటే ఇంటికే పరిమితం అయ్యేవారు. కాని ఇప్పుడు తమ భర్త క్రేజ్‌ను ఉపయోగించుకుని బయట వ్యాపారాలు చేస్తున్నారు. తాజాగా సుకుమార్ భార్య కూడా లాండ్రీకార్ట్ అనే సంస్థను ప్రారంభించింది.
ఇందులో బాగా ఖరీదైన డ్రస్‌లను డ్రై వాష్ చేయడం, డ్రై క్లీనింగ్ చేయడం, ఐరన్ చేయడం వంటివి చేస్తారట. చాలా డిఫరెంట్‌గా ఉన్న ఈ బిజినెస్ చాలా లాభదాయకంగా ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈమె కూడా సుకుమార్‌కు తగ్గ భార్య అనిపించుకుని ల్యాండ్రీ బిజినెస్‌లో దూసుకు పోతుంది.