హ్యాపీ వెడ్డింగ్ సినిమాతో మరో ప్లాపును తన ఖాతా లో వేసుకున్న సుమంత్ అశ్విన్ రూటు మార్చి హార్రర్ సినిమాలో నటిస్తున్నాడు. దండుపాళ్యం సినిమాలతో మాస్ ప్రేక్షకులలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించిన దర్శకుడు శ్రీనివాస రాజు ఈ హార్రర్ థ్రిల్లర్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సౌత్ లోని నాలుగు భాషలైన తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాని ఎం. కోటేశ్వరరాజు నిర్మిస్తున్నారు. ఈయనే రాజశేఖర్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన గరుడవేగ సినిమాని నిర్మించారు.
ఇది విభిన్న నవంబర్ రెండో వారం నుండి షూటింగ్ మొదలవుతున్న ఈ సిమా గురించి, దర్శకుడు చెప్తూ “ఇది విభిన్న కథాంశం తో తెరకెక్కుతున్న సినిమా అని, హార్రర్ నేపథ్యం లో సాగినా , ప్రేక్షకులని థ్రిల్ చేసే అంశాలు చాలా ఉన్నాయని, హార్రర్ చిత్రాల్లో ఒక ట్రెండ్ సెట్ చేయగల సినిమా ఇదవుతుందని, కథ ప్రకారం ఏమాత్రం రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని సౌత్ లోని అన్ని భాషల్లో చిత్రీకరించి, ఒకేసారి విడుదల చేస్తామని, రీ-రికార్డింగ్ కి ప్రాధాన్యత ఉన్న దృష్ట్యా మణిశర్మ గారిని తీసుకున్నామని” చెప్పారు.