నాగ్‌, సుమంత్‌ల వివాదంపై క్లారిటీ

sumanth Responds to Clashes with Nagarjuna

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అక్కినేని ఫ్యామిలీ హీరోలు అయిన నాగార్జున మరియు సుమంత్‌ల మద్య గత కొంత కాలంగా విభేదాలు ఉన్నాయి అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మామ అల్లుడు అయిన వీరిద్దరు ఆస్తి విషయంలో గొడవలు పడ్డారు అంటూ సినీ వర్గాల్లో కూడా గుసగుసలు వినిపించాయి. నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మలు బతికి ఉన్నంత కాలం సుమంత్‌ వారితో కలిసి ఉండే వాడు. ఆ కారణంగానే నాగేశ్వరరావు నుండి సుమంత్‌ ఆస్తి తీసుకున్నాడు అంటూ నాగార్జున ఆరోపణలు చేస్తున్నాడు అంటూ కొందరు మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తల్లిలేని పిల్లలు అంటూ సుమంత్‌పై నాగేశ్వరరావు దంపతులు ఎక్కువ శ్రద్ద పెట్టడం కూడా నాగార్జునకు ఇష్టం ఉండేది కాదట. ఆ కారణంగానే సుమంత్‌పై కోపం పెంచుకున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

సుమంత్‌ తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. అసలు ఇలాంటి వార్తలు వస్తున్న సంగతి తనకు తెలియదు అని, ఇలాంటి పుకార్లు ఎలా పుట్టించారో కూడా తనకు అర్థం కావడం లేదు అంటూ సుమంత్‌ చెప్పుకొచ్చాడు. సుమంత్‌ చాలా కాలంగా సక్సెస్‌ కోసం చకోరా పక్షిలా ఎదురు చూస్తున్నాడు. ఎట్టకేలకు సుమంత్‌కు ‘మళ్లీ రావా’ అనే చిత్రంతో సక్సెస్‌ దక్కింది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సుమంత్‌ మాట్లాడుతూ మామయ్యతో విభేదాలపై క్లారిటీ ఇచ్చాడు. మామయ్యతో అసలు తాను ఎప్పుడు విభేదించలేదు అని, మామయ్య నాకు ఎప్పుడు ఒక స్నేహితుడిగా సలహాలు ఇస్తూ, నాకు కష్టాలు వచ్చినప్పుడు వెన్ను తట్టి నిలిచాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఆస్తి గొడవలు అంటూ వచ్చిన ప్రచారంలో నిజం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.