మెగా అల్లుడికి జోడీ ఫిక్స్‌

megha hero kalyan first movie heroine anupama parameswaran

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగాస్టార్‌ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ మాత్రం జరిగి పోతుంది. శశి అనే దర్శకుడి దర్శకత్వంలో కళ్యాణ్‌ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే ఒక యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ కథను సిద్దం చేయడం జరిగింది. ఆ కథకు మెగా ఫ్యామిలీ మొత్తం చిరంజీవితో సహా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దాంతో త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌ ఎవరు అనే విషయంపై కూడా క్లారిటీ వచ్చింది.

Chiranjeevi's son-in-law Kalyan Kanuganti first movie heroine fixed

మొదట కళ్యాణ్‌కు జోడీగా కొత్త అమ్మాయిని ఎంపిక చేయాలని భావించారు. అయితే రామ్‌ చరణ్‌ సలహా మేరకు కథానుసారంగా అనుపమ పరమేశ్వరన్‌ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. కథ విన్న తర్వాత ఈ స్క్రిప్ట్‌కు కొత్త హీరోయిన్‌ కంటే అనుపమ పరమేశ్వరన్‌ అయితే పక్కాగా సూట్‌ అవుతుందని చరణ్‌ సలహా ఇవ్వడం, ఆ విషయాన్ని చిరంజీవి కూడా సమర్ధించడంతో శశి మరో ఆలోచన లేకుండా అనుపమ పరమేశ్వరన్‌ను ఎంపిక చేయడం జరిగింది. మలయాళ ‘ప్రేమమ్‌’ చిత్రంతో ఆకట్టుకున్న అనుపమ పరమేశ్వరన్‌ తెలుగులో ‘అఆ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా పలు చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకుంది. అందుకే ఆమె అయితే కళ్యాణ్‌కు సరి జోడీగా మెగా ఫ్యామిలీ భావిస్తుంది.