‘కీర్తి’ తో విడాకులకి కారణం ఆ ‘హీరో’ కాదు… సుమంత్

Sumanth says reason Divorce with Keerthi Reddy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అక్కినేని మనవడు, నాగార్జున మేనల్లుడుగా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్, ప్లాప్ లను పట్టించుకోకుండా వరుస సినిమాలలో నటిస్తున్న నటుడు సుమంత్… పవన్ కళ్యాణ్ తో ‘తొలి ప్రేమ’సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన అమ్మాయి కీర్తి రెడ్డి… వీరిద్దరూ ప్రేమించుకొని , పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయితే చేసుకున్నారు కానీ, కలిసి జీవించడంలో వీళ్ళిద్దరూ ఫెయిల్ అయ్యారు. రెండేళ్లు తిరిగేసరికే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇప్పటి వరకు సుమంత్-కీర్తి విడిపోవడానికి సరైన కారణాలేంటన్నది తెలియలేదు.

కొందరు మాత్రం ‘నాగార్జున’ వల్లనే సుమంత్- కీర్తి లు విడిపోయరాని, కీర్తి రెడ్డి ప్రవర్తన నచ్చని ‘నాగ్’ కొన్ని సార్లు కీర్తి ని మందలించాడని, అప్పటికీ తన ప్రవర్తనలో మార్పు రాకపోవటంతో సుమంత్- కీర్తి లకు నాగ్ విడాకులు ఇప్పించాడని కొన్ని పుకార్లు వచ్చాయి. కానీ సుమంత్ దీనిపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చాడు . తమ బంధం ఏడాదిన్నర మాత్రమే నిలిచిందని, ఆ ఏడాదిన్నర కాలంలో తమ ఇద్దరి వ్యక్తిత్వాలు, ఆలోచనలు, జీవితాలు పూర్తి భిన్నంగా ఉండేవని, ఆ విషయం మా ఇద్దరికీ అర్థమైందని, అందుకే మా ఇద్దరి ఉమ్మడి అంగీకారంతోనే విడిపోవడానికి నిర్ణయించుకున్నామని… తన విడాకుల విషయంలో తన మావయ్య నాగార్జున పాత్ర ఉన్నట్లు వచ్చిన వార్తలు నిజం కాదని సుమంత్ స్పష్టంచేసాడు.

విడాకులు తర్వాత కీర్తి పెళ్లి చేసుకుని అమెరికాలో ఇద్దరు పిల్లలతో చాలా సంతోషంగా ఉందని… కీర్తితో తాను ఇప్పటికీ టచ్ లోనే ఉన్నానని, అప్పుడప్పుడూ ఫోన్లో కూడా మాట్లాడుతుంటానని, ఇప్పటికీ కీర్తి కుటుంబం తననెంతగానో గౌరవిస్తుందని, చివరగా తన తాత ఏఎన్నార్ చనిపోయినపుడు కూడా కీర్తి ఇక్కడికి వచ్చి వెళ్లిందని సుమంత్ ఈ ఇంటర్వ్యూ లో వివరణ ఇచ్చాడు. ఈ మాటలతో ఇప్పటివరకు తన విడాకులపై వచ్చిన పుకార్లకు సుమంత్ చెక్ పెట్టినట్లయింది.