అజ్ఞాతవాసి మీద కాపీ ముద్ర వేస్తున్న కత్తి మహేష్.

kathi mahesh sensational comments on agnathavasi teaser

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అజ్ఞాతవాసి సినిమా టీజర్ విడుదల కాగానే అంతా అది ఎలా ఉందో చెబుతున్నారు. కానీ ఫిలిం క్రిటిక్ గా చెప్పుకునే కత్తి మహేష్ మాత్రం ఆ టీజర్ ఎలా వుంది అన్న విషయం పక్కనబెట్టి సినిమా మీద కొత్త అనుమానాలకు తెర లేపాడు. పవన్ ఫాన్స్ ని ఇంకాస్త రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. 2008 లో వచ్చిన హాలీవుడ్ మూవీ “ లార్దో వించ్ “ అనే సినిమా ట్రైలర్ ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన కత్తి మహేష్ “ ఎందుకైనా మంచిది . ఈ సినిమా చూసి బాగా గుర్తు పెట్టుకోండి “ అని కామెంట్ చేసాడు. దీంతో చెప్పీచెప్పకుండానే “అజ్ఞాతవాసి “ సినిమా ఆ హాలీవుడ్ సినిమాకి కాపీ అన్న అర్ధం వస్తోంది.

kathi-mahesh-review-on-agna

ఇప్పటికే కత్తి మహేష్ , పవన్ ఫాన్స్ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు తాజా కామెంట్ తో పరిస్థితి ఇంకాస్త గరం గరం గా మారే అవకాశం వుంది. ఇంతకుముందు కూడా పెద్ద హీరోల సినిమాలు విడుదల అయ్యాక ఇలాంటి ప్రచారం జరిగేది. కానీ ఇప్పుడు పవన్ , త్రివిక్రమ్ ల అజ్ఞాతవాసి విడుదల అయినా కాక ముందే కత్తి మహేష్ ఓ హాలీవుడ్ సినిమా కాపీ అన్న అర్ధం వచ్చేలా ముందస్తు ప్రచారానికి దిగడం చూసి పవన్ ఫాన్స్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సినిమా విడుదల అయ్యాక ఏదైనా సీన్స్ కాపీ ఉంటే చెప్పినా అర్ధం ఉంటుంది కానీ ముందుగానే కత్తి మహేష్ ఇలాంటి ప్రచారం చేయడాన్ని వాళ్ళు సీరియస్ గా తీసుకుంటున్నారు.