సునీల్‌ పరిస్థితి ఏంటీ?

Sunil Tollywood Industry Talk

కమెడియన్‌గా ఎంతో స్ట్రగుల్‌ అయ్యి మంచి కమెడియన్‌గా గుర్తింపు దక్కించుకుని, స్టార్‌ కమెడియన్‌గా ఎదిగిన సునీల్‌ హీరో అంటూ సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. హీరోగా ఒకటి రెండు సక్సెస్‌లు దక్కాయి. కాని సునీల్‌కు హీరోగా కాలం కలిసి రాలేదు. వరుసగా ఫ్లాప్‌ అవ్వడంతో సునీల్‌ హీరోగా సినిమాలు చేయవద్దని నిర్ణయించుకున్నాడు. కమెడియన్‌ పాత్రలు చేయాలని భావించిన సునీల్‌కు త్రివిక్రమ్‌ మరియు శ్రీనువైట్లలు ఛాన్స్‌ ఇచ్చారు. సిల్లీఫెలోస్‌ చిత్రంతో కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్‌ ఆచిత్రం నిరాశ పర్చినా కూడా త్రివిక్రమ్‌ తనకు అరవింద సమేత చిత్రంలో మంచి పాత్ర ఇస్తాడని, తప్పకుండా మళ్లీ బిజీ అవుతానని సునీల్‌ అనుకున్నాడు. కాని ఆ చిత్రంలో సునీల్‌ చేసిన పాత్ర అసలు నోటెడ్‌ కాలేదు.

sunil And allu arjun

ఇక శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రంలో కూడా కీలక పాత్ర పోషించాడు. ఈచిత్రంతో అయినా సక్సెస్‌ తలుపు తట్టి కమెడియన్‌గా బిజీ అవుతానని సునీల్‌ ఆశపడ్డాడు. కాని ఆ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడంతో సునీల్‌ మరోసారి నిరాశగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. త్వరలో అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్‌ ఒక చిత్రం చేయబోతున్నాడు. ఆ చిత్రంలో సునీల్‌ నటించడం ఖాయం. మరి ఆ చిత్రంతో అయినా సునీల్‌కు సక్సెస్‌ దక్కుతుందా అనేది చూడాలి. సునీల్‌ హీరోగా సినిమా చేసి పెద్ద తప్పు చేశాడు అంటూ ఇప్పుడు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సునీల్‌ కమెడియన్‌గా అవకాశాలు రాకుంటే పరిస్థితి ఏంటో అంటూ ఆయన పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి సునీల్‌ మళ్లీ సినిమాల్లో రాణిస్తాడా లేదంటే మరేదైనా మార్గంను వెదుక్కుంటాడా చూడాలి.