కేసీఆర్ ఏమి చెప్పి ఒప్పించారబ్బా…?

Trs Candidates Final List Released With Two Names

గ్రేటర్ రాజకీయాల్లో కీలక స్థానమైన ముషీరాబాద్‌ అభ్యర్థిత్వం టీఆర్‌ఎస్‌ రాజకీయాల్లో ఉత్కంఠ రేపింది. ఈ స్థానాన్ని తన అల్లుడు, కార్పొరేటర్‌ శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలని కోరుతున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, అది సాధ్యపడక పోతే తానే పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఆ మధ్య శ్రీనివాసరెడ్డి కూడా తనకు అధిష్ఠానం టికెట్‌ ఇవ్వకపోతే ముషీరాబాద్‌ నుంచి నాయిని పోటీ చేస్తారని పేర్కొన్నారు. దీంతో ఈ స్థానం ఎవరికి దక్కుతుందనేది ఇన్ని రోజులూ ఆసక్తికరంగా ఉండేది. దీనికితోడు నాయిని ఈ సీటును దక్కించుకోని పక్షంలో టీఆర్ఎస్ నుంచి తప్పుకుంటానని అధిష్ఠానానికి చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ కారణంతోనే కేసీఆర్ ఈ స్థానాన్ని పెండింగ్‌లో ఉంచారు. అయితే, నామినేషన్‌ దాఖలు చేయడానికి సోమవారమే ఆఖరు కావడంతో పెండింగ్‌లో ఉన్న ముషీరాబాద్‌తో పాటు, కోదాడ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.

kcr
దీంతో ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థిపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. అక్కడి నుంచి టికెట్ ఆశించిన హోంమంత్రి నాయినికి మొండి చేయి చూపించారు గులాబీ బాస్. తనకు నచ్చిన నేతకే టికెట్ ఇచ్చి నాయినికి అదిరిపోయే షాక్ ఇచ్చారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ముషీరాబాద్ స్థానాన్ని ముఠా గోపాల్‌కు కేటాయిస్తూ అధికారిక ప్రకటన చేసింది టీఆర్ఎస్ అధిష్ఠానం. ఇక్కడ టీఆర్‌ఎస్‌ గెలవాలంటే కచ్చితంగా ముఠాగోపాల్‌నే ఎంపిక చేయాలని భావించి ఆయన పేరునే ప్రకటించినట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. దీంతో అక్కడి టికెట్ ఆశించిన నాయినికి, ఆయన అల్లుడు శ్రీనివాసరావుకు గట్టి షాక్ తగిలినట్లైంది.

Naini-Narsimha-Reddy
నాయినిని ఏం చెప్పి ఒప్పించారో కానీ, ముఠా గోపాల్‌కు బీఫామ్ కూడా పార్టీ అధినేత నిర్ణయంతో తన చేతులతోనే ముఠాగోపాల్‌కు పార్టీ బీ ఫారం అందించారు. నాయిని కూడా తన నామినేషన్ కార్యక్రమానికి వస్తేనే పోటీ చేస్తానని ముఠా గోపాల్ చెప్పారని, అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి హోంమంత్రి వచ్చి గోపాల్‌తో నామినేషన్ దాఖలు చేయించే విధంగా కేసీఆర్ ప్లాన్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ సిట్టింగ్ స్థానమైన ముషీరాబాద్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మణ్‌ మరోసారి బరిలోకి దిగుతుండగా, మహాకూటమి తరపున కాంగ్రెస్ యూత్‌ అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ బరిలోకి దిగబోతున్నారు. అయితే అసలు నాయినికి ఏమి చెప్పి ఒప్పించారా అనేది ఆసక్తికరంగా మారింది.