మేడ్చల్ ప్రజావేదిక కు హాజరు కానున్న సోనియా గాంధీ

తెలంగాణాలో రానున్న అసెంబ్లీ ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా సాగుతూ, పోటీలో పాల్గొనే పార్టీల ఎన్నికల ప్రచారాలు వేడిని రాజేస్తున్నాయి. డిసెంబర్ 7 న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించబడుతున్న విషయం తెలిసిందే మరియు దీని ఫలితాలు డిసెంబర్ 11 న తేలనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెరాస పార్టీ ని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ మరో రెండు పార్టీలైన తెలుగుదేశం మరియు తెలంగాణ జన సమితి తో పొత్తు పెట్టుకొని ‘మహాకూటమి’ పేరుతో ఎన్నికల బరిలో దిగబోతుంది.

మేడ్చల్ ప్రజావేదిక కు హాజరు కానున్న సోనియా గాంధీ - Telugu Bullet

ఈ నేపథ్యంలో యూపీఏ ఛైర్పర్సన్త్ అయిన సోనియా గాంధీ మేడ్చల్ లో జరగబోతున్న ప్రజావేదిక కు హాజరు కాబోతుంది. ఈ నెల 23 న జరగబోతున్న ఈ ప్రజావేదికకు హాజరు అయ్యేందుకు, సోనియా గాంధీ నవంబర్ 23 రోజున సాయంత్రం 5 గంటలకు బేగంపేట విమానాశ్రయం కు చేరుకొని, అక్కడినుండి 40 కిమీ ల దూరంలో ఉన్న మేడ్చల్ కు రోడ్ ప్రయాణం చేస్తారు. అదేరోజున రాత్రి 8 గంటలకు న్యూ ఢిల్లీ కి తిరుగుప్రయాణం చేపడతారు.

మేడ్చల్ ప్రజావేదిక కు హాజరు కానున్న సోనియా గాంధీ - Telugu Bullet

ఈ సందర్భంగా సోనియా గాంధీ ప్రచారం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడుతుందని, ప్రజలను ఆలోచింపచేస్తుందని నేతలు భావిస్తున్నారు. అంతేకాకుండా, ఈ ప్రజావేదిక లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయమే ముఖ్యకారణం అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తెరాస నేత కెసిఆర్ తెలంగాణ వస్తే తెరాస ని కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేస్తా అన్న ప్రకటనకి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ ని వెన్నుపోటు పొడిచి, 2014 ఎన్నికల్లో తెలంగాణ ఏర్పాటు తన ఘనతగా చెప్పుకొని అధికారంలోకి వచ్చిన విషయాన్నీ ప్రముఖంగా ఈ సభలో లేవనెత్తాలని భావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ కూడా తెలంగాణలో ప్రచారానికి సిద్ధం అవుతున్నారు. కానీ, ఎప్పుడనే విషయం ఇంకా ఖరారు కాలేదు. ఇప్పటికే మహాకూటమి పైన అంచనాలు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో సోనియా గాంధీ ప్రచారం వలన కాంగ్రెస్ నేతలు మరియు కార్యకర్తల్లో ఖచ్చితంగా బలం చేకూరుతుందని భావిస్తున్నారు.