ఉంగరాల రాంబాబు కధ ఇదేనా ?

Sunil Ungarala Rambabu movie Story

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
ఒక్క హిట్ పడితే చాలు అంతా మారిపోతుందని ఎన్నో పరాజయాలు ఎదురైనా ముందుకు వెళుతున్నాడు హీరో సునీల్. ఆయన ఫెయిల్యూర్స్ చూసి ఎందుకు హాయిగా కామెడీ చేసుకోక అని అనేవాళ్లకు కొదవ లేదు. అయినా సునీల్ వెనక్కి తగ్గడం లేదు. మరో రెండు రోజుల్లో ఉంగరాల రాంబాబుగా మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా దర్శకుడు క్రాంతి మాధవ్ ట్రాక్ రికార్డు చూస్తే సినిమాలో మ్యాటర్ ఉందని అనుకోవడంలో తప్పులేదు. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి ఇంటెన్స్ సినిమాలు చేసిన దర్శకుడు కావడంతో ఉంగరాల రాంబాబు మీద గట్టి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమా ట్రైలర్ చూసి కథని ఉహించాడు ఓ ఔత్సాహికుడు. ఆ కధ ఏమిటంటే …

రాంబాబు జీవితం హాయిగా సాగిపోతుంటుంది. పట్టిందల్లా బంగారం అయ్యి ఆర్ధికంగా ఎదుగుతాడు. అయితే కొన్నాళ్ళకి ఆ అదృష్టం తిరగబడుతుంది. ఎక్కడ చేయి పెట్టినా కాలే పరిస్థితి వస్తుంది. దీని నుంచి బయట పడాలంటే ఫలానా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఓ పంతులు గారు సలహా ఇస్తాడు. ఇక అప్పటినుంచి ఆ అమ్మాయి కోసం వెదుకులాట మొదలెడతాడు. ఆ అన్వేషణ అటు తిరిగి ఇటు తిరిగి చివరకు సొంత ఆఫీస్ లోనే ముగుస్తుంది. తన ఆఫీస్ లో పని చేసే ఓ అమ్మాయిని చేసుకుంటే అంతా మారిపోతుందని రాంబాబు అనుకుంటాడు. అయితే ఆ పిల్ల ఆలోచనలు వేరుగా ఉన్నాయని తెలుసుకుని ఆమెని ఇంప్రెస్స్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆమె అతన్ని ఇష్టపడుతుంది కానీ పెళ్ళికి ఓ షరతు పెడుతుంది. తన తండ్రిని కూడా పెళ్ళికి ఒప్పించాలని అడుగుతుంది. అందుకోసం ఆ పిల్ల సొంతూరు కేరళలోని ఓ గ్రామానికి వెళ్లిన రాంబాబుకి అక్కడి వ్యవహారాలు షాక్ ఇస్తాయి. ఆ పరిస్థితుల్లో అక్కడ రాంబాబు పిల్ల తండ్రిని ఒప్పించడానికి చేసిన ప్రయత్నమే ఉంగరాల రాంబాబు మిగిలిన కధ.


మరిన్ని వార్తలు:

జై ల‌వ‌కుశ ట్రైల‌ర్ కు 24 గంట‌ల్లో 7.54 మిలియ‌న్ల డిజిట‌ల్ వ్యూస్‌

ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ ఇచ్చిన హోమ్ వర్క్?

చైతూ, సామ్‌ రిసెప్షన్‌ అప్‌డేట్స్‌