ఆ గ‌తం చెరిగిపోతే బాగుండు… స‌న్నీలియోని

Sunny Leone crying after watching her Documentary movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

బాలీవుడ్ స్టార్ స‌న్నీలియోని జీవితంలో ఎన్నో ఎత్తుప‌ల్లాలు చూసింది. భార‌తీయ మూలాలు ఉన్న స‌న్నీ పోర్న్ స్టార్ గా మార‌డం నిజంగా ఆమె జీవితంలో విషాద‌మే. ఉపాధి కోసం కావాలనే ఆ వృత్తి ఎంచుకున్న‌ప్ప‌టికీ… ఆమె ఎప్పుడూ సంతోషంగా లేదు. విధి లేని ప‌రిస్థితుల్లోనే ఆమె గ‌తంలో పోర్న్ స్టార్ గా న‌టించింద‌ని ఆమె అప్పుడ‌ప్పుడూ చెప్పే మాట‌లు వింటే అర్ధ‌మ‌వుతుంది. ఓ అనాథ బాలిక‌ను ద‌త్త‌త తీసుకోవ‌డంతో పాటు స‌రోగ‌సీ ద్వారా ఇద్ద‌రు బిడ్డ‌ల‌కు త‌ల్లి అయిన స‌న్నీ తాను న‌డిచిన బాట త‌న పిల్ల‌ల‌కు వ‌ద్ద‌ని చెబుతూ ఉంటుంది. బాలీవుడ్ లో స్టార్ గా ఎదిగిన త‌ర్వాత స‌న్నీ పోర్న్ చిత్రాల్లో న‌టించ‌డం మానేసిన‌ప్ప‌టికీ… ఆమె గ‌త జీవితం తాలూకూ విషాదాన్ని మ‌రిచిపోలేక‌పోతోంది.

త‌నజీవిత చరిత్ర ఆధారంగా తీసిన డాక్యుమెంట‌రీ చూసి, గ‌తం గుర్తుకుతెచ్చుకుని రాత్రంతా విల‌పిస్తూనే ఉంది. తాను త‌ప్పుచేశాన‌న్న భావ‌న‌కు లోన‌యింది. ఆ గ‌తం చెరిగిపోతే బాగుండ‌నుకుంది. ఈ విష‌యాన్ని స‌న్నీనే స్వ‌యంగా తెలియ‌జేసింది. స‌న్నీ జీవితం ఆధారంగా క‌ర‌ణ్ జిత్ కౌర్ – ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ స‌న్నీలియోని అనే డాక్యుమెంట‌రీ తెర‌కెక్కింది. కర‌ణ్ జిత్ కౌర్ అనేది స‌న్నీ అస‌లు పేరు. క‌ర‌ణ్ స‌న్నీలియోన్ గా మార‌డం వెన‌క ఉన్న క‌థ‌ను ఈ డాక్యుమెంట‌రీలో చూపించారు.

ఆమె పోర్న్ స్టార్ గా మార‌డానికి దారితీసిన ప‌రిస్థితులు, ఆమె జీవితంలోని మ‌లుపులు డాక్యుమెంట‌రీలో పొందుప‌రిచారు. ఆ డాక్యుమెంట‌రీ ప్ర‌ద‌ర్శ‌న‌ను చూసిన స‌న్నీ భావోద్వేగానికి గుర‌యింది. ఆ డాక్యుమెంట‌రీ చూస్తున్నంత సేపు క‌న్నీరు ఆగ‌లేద‌ని సన్నీ ట్విట్ట‌ర్ లో తెలియ‌జేసింది. త‌న హృద‌యం వేల‌సార్లు బ‌ద్ద‌ల‌యింద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేసింది. పోర్న్ స్టార్ గా మార‌క‌ముందు తాను ఎలా ఉండేదాన్నో… అలా మ‌ళ్లీ కావాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్న‌ది. ఆ రోజు ఎప్ప‌టికీ రాద‌ని, కానీ త‌న పాత వ్య‌క్తిత్వం ఎప్ప‌టికీ గుర్తుంటుంద‌ని స‌న్నీ బాధ‌ప‌డింది. తాను త‌ప్పుచేశాన‌ని ప‌శ్చాత్తాపం వ్య‌క్తంచేసింది.