కేరళ వరద బాధితుల కోసం తమ అభిమాన తారలు కోట్లకు కోట్లు విరాళాలు ఇస్తున్నారు అంటూ కొందరు అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ వస్తున్నారు. తాజాగా విజయ్ ఏకంగా 14 కోట్లు ఇచ్చాడని, రొనాల్డో భారీ సాయంను కేరళకు ప్రకటించాడు అంటూ రకరకాలుగా ప్రచారం జరిగింది. ఇక సన్నీలియోన్ కేరళ వరద బాధితులకు 5 కోట్ల సాయంను ప్రకటించింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆమద్య కేరళకు సన్నీలియోన్ వచ్చిన సమయంలో సంచలన రీతిలో ఆమెకు రెస్పాన్స్ దక్కింది. ఆ రెస్పాన్స్‌కు సన్నీలియోన్ షాక్ అయ్యింది. తనను అంతగా ఆధరించినందుకు కేరళకు సాయం చేసేందుకు ఏకంగా 5 కోట్లను విరాళంగా ఆమె ఇచ్చినట్లుగా అభిమానులు కొందరు పుకార్లు పుట్టించారు.
కేరళ వరద బాధితులకు సన్నీలియోన్ చేసిన సాయం కేవలం పుకార్లే అని, ఆమె తాజాగా తనకు తోచిన మొత్తంలో సాయం చేసింది. తన స్నేహితులతో కలిసి కేరళ వరద బాధితులకు 1500 కేజీల బియ్యంను మరియు పప్పును అందిస్తున్నట్లుగా సన్నీలియోన్ ప్రకటించింది. ప్రస్తుతం వారికి ఏదైతే కావాలో అదే ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలో మరింత సాయంతో కేరళ ప్రజలను ఆదుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా సన్నీలియోన్ పేర్కొంది. తాజాగా ముంబయిలలో కేరళ వరద బాధితుల కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిర్వహించిన బాలీవుడ్ ప్రముఖులను ఆమె అభినందించింది. మొత్తానికి సన్నీ లియోన్ కోట్లల్లో సాయం చేయకున్నా కూడా తనకు తోచిన మేరకు సాయం చేసి కేరళ ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది.