మీనాకుమారిగా స‌న్నీలియోనీ

Sunny Leone to play Tragedy Queen Meena Kumari in her biopic

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బాలీవుడ్ లో ఇప్పుడు బ‌యోపిక్ ల ట్రెండ్ న‌డుస్తోంది. సినిమా తార‌లు, క్రికెట‌ర్ల జీవితాల ఆధారంగా సినిమాలు తెర‌కెక్కి బాక్సాఫీసును కొల్ల‌గొడుతున్నాయి. ఆ త‌ర‌హాలోనే మ‌రో బ‌యోపిక్ కు బాలీవుడ్ సిద్ధ‌మ‌యింది. ట్రాజెడీ క్వీన్ మీనాకుమారి జీవితాన్ని సినిమాగా తీయాల‌ని క‌ర‌ణ్ రాజ్దాన్ భావిస్తున్నారు. మీనా కుమారి పాత్ర విద్యాబాల‌న్ చేస్తోంద‌ని వార్త‌లొచ్చాయి… కానీ చివ‌రికి అందాల‌తార స‌న్నీలియోనీ ఈ పాత్ర‌కు ఎంపికై అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

Sunny-Leone

మీనాకుమారి పాత్ర‌లో సన్నీ న‌టిస్తార‌ని ఎవ‌రూ ఊహించి ఉండ‌ర‌ని, కానీ క‌థ విన్న వెంట‌నే సినిమా చేయ‌డానికి స‌న్నీ ఒప్పుకున్నార‌ని క‌ర‌ణ్ రాజ్దాన్ తెలిపారు. సినిమా స్క్రిప్ట్ ను మాధురీదీక్షిత‌, విద్యాబాల‌న్ కు వినిపించాన‌ని, కానీ వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల వాళ్లు ఒప్పుకోలేద‌ని చెప్పారు. స‌న్నీలియోని త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి స్క్రిప్ట్ చెప్ప‌మ‌ని కోరార‌ని, త‌న‌కు అర్ధ‌మ‌య్యేలా స్క్రిప్ట్ చెప్పిన త‌ర్వాత సినిమా చేస్తాన‌న్నార‌ని క‌ర‌ణ్ వివ‌రించారు.

Meena-Kumari-biopic

అస‌లు ఈ పాత్ర‌కు సన్నీని తీసుకోవాల‌ని అనుకోలేదన్నారు. సినిమాలో మీనాకుమారి తాగుడుకు బానిసై చ‌నిపోవ‌డం వంటి విష‌యాలను చూపిస్తున్నామ‌ని…ఆమె పాత్ర‌లో న‌టించే ధైర్యం సన్నీకే ఉంద‌ని ఆయ‌న ప్ర‌శంసించారు. సినిమాపై స‌న్నీ చాలా న‌మ్మ‌కంగా ఉన్నార‌న్నారు. బాలీవుడ్ తొలి త‌రం హీరోయిన్ల‌లో అగ్ర‌క‌థానాయిక‌గా వెలుగొందిన మీనాకుమారి సాహిబ్ బీబీ ఔర్ గులాం, పాకీజా, మేరే అప్నే, ఆర్తి, ప‌రిణీతి వంటి చిత్రాల‌తో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు.