బ్రహ్మానందం ఎమ్మెల్యే , పవన్ సీఎం కాలేరు.

Venu Swamy comments on Pawan Kalyan Not CM then Pawan Fans Attack on Him

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నంద్యాల ఉపఎన్నికల ఫీవర్ ఆంధ్రప్రదేశ్ ని ఊపేస్తున్న టైం లో అక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి జాతకంలో ఎమ్మెల్యే అయ్యే యోగమే లేదని చెప్పాడు సోషల్ మీడియా ప్రముఖుల భవిష్యత్ చెప్పే జోస్యుడు వేణు స్వామి. నంద్యాల ఫలితం తరువాత ఆ మ్యాటర్ ఏమీ తెలియనట్టు కొన్నాళ్ళు మౌనం వహించిన సదరు వేణు స్వామి మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈసారి ఆయన కన్ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పడింది. ఎప్పుడైతే ఏపీ లో పర్యటన చేస్తూ పవన్ జనం నోళ్ళలో నానడం మొదలు పెట్టారో అప్పుడే వేణు స్వామి రంగంలోకి దిగేసి ఆయన జాతకం ఏంటో చెప్పేసారు.

పవన్ కళ్యాణ్ పుట్టిన సమయం ఆధారంగా వేణు స్వామి ఆయన జాతకం చెప్పారు. పవన్ ఎట్టి పరిస్థితుల్లో సీఎం కాలేరని కుండ బద్దలు కొట్టారు. వేణు స్వామి ఇలా చెప్పడం ఆలస్యం కత్తి మహేష్ కి ఇచ్చిన ట్రీట్ మెంట్ పవన్ అభిమానుల దగ్గర నుంచి ఈ జోస్యుడుకి కూడా మొదలు అయ్యింది. ఇక సోషల్ మీడియాలో అయితే పవన్ ఫాన్స్ ఓ రేంజ్ లో వేణుస్వామిని ఆడేసుకుంటున్నారు. దీనికి ఆయన బాగా హర్ట్ అయ్యారు. విమర్శలు చేసిన వాళ్ళు అందరినీ పవన్ ఫాన్స్ ఇలా చేయగలదా అని వాపోతున్నారు. ఇదే సమయంలో ఇంకో మిత్రుడు వేణు స్వామి ప్రధాని మోడీని కలిసినట్టు బయటకు వచ్చిన ఫోటో మార్ఫింగ్ దని చెబుతూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇలా ఒకదాని వెనుక ఇంకో సమస్య వేణుస్వామిని వెంటాడుతోంది. ఈయన గారు ఇలా మాట్లాడేందుకు జగన్ అంటే వున్న పిసరంత అభిమానమే కారణం అని వేణు స్వామి సన్నిహితులే కాదు పవన్ ఫాన్స్ కూడా తేల్చేశారు. పవన్ సీఎం అయినా, కాకపోయినా సెలెబ్రెటీల జాతకం చెప్పి ప్రచారంలో ఉండాలి అనుకున్న వేణుస్వామి ఐడియా మాత్రం బాగానే వర్కౌట్ అయ్యింది.