సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాకి బ్యాడ్ టాక్

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాకి బ్యాడ్ టాక్

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ‘దర్బార్’కు ముందు అనుకున్న రిలీజ్ డేట్ జనవరి 10. ఐతే తెలుగులో ముందుగా జనవరి 12న ఒకే రోజు ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ రావాల్సి ఉండగా.. అందులో ఒకటి వెనక్కి తగ్గి 11కు ఫిక్సవడంతో ‘దర్బార్’ డేట్‌ను కూడా ఒక రోజు ముందుకు జరిపారు. తమిళ డేట్‌ను కూడా ఆ మేరకు మార్చుకున్నారు.

ఈ రెండు రోజుల గ్యాప్‌లో భారీగా వసూళ్లు రాబట్టుకుని తెలుగు వెర్షన్‌కు బ్రేక్ ఈవెన్ సాధించాలన్నది ప్లాన్. మహేష్, బన్నీ సినిమాల కోసం అట్టిపెట్టిన థియేటర్లన్నింట్లోనూ ‘దర్బార్’నే నడిపించాలని, మల్టీప్లెక్సుల్లో కూడా ఈ రెండు రోజులు మాగ్జిమం షోలు రజనీ చిత్రానికే ఇచ్చేలా చూసుకోవాలని ప్లాన్ చేశారు. ప్లాన్ బాగానే ఉంది. దాన్ని అనుకున్నట్లుగానే అమలు చేశారు.

‘దర్బార్’ విషయంలో అదే జరిగింది. ఒకప్పుడైతే రజనీ సినిమా అంటే పిచ్చెక్కి పోయేవాళ్లు జనాలు. టాక్ గురించి ఆలోచించకుండా ముందే భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకునేవారు. కానీ ‘దర్బార్’ విషయంలో అలా జరగలేదు. ఈ చిత్రానికి తొలి రోజు కూడా అన్ని షోలూ నిండలేదు. చాలా థియేటర్లలో ఆక్యుపెన్సీ 50-60 శాతానికి పరిమితం అయింది. కొన్ని షోలకే హాళ్లు నిండాయి.

ఇక ఈ చిత్రానికి బ్యాడ్ టాక్ రావడంతో రెండో రోజుకే థియేటర్లు ఖాళీ అయిపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైనపుడే రెండు రోజులకూ భారీగా థియేటర్లిచ్చారు. బుకింగ్స్ ఓపెన్ చేశారు. కానీ తొలి రోజులకే అంతగా డిమాండ్ లేదు. రెండో రోజు పూర్తిగా థియేటర్లు ఖాళీగా ఉండిపోయాయి. టాక్ బాలేకపోవడంతో అవేవీ కూడా నిండే పరిస్థితి లేదు. అనవసరంగా సినిమాకు ఎక్కువగా థియేటర్లిచ్చినట్లయింది.