సూపర్‌ స్టార్‌ మూవీ వాయిదా పడ్డట్లేనా?

super star rajinikanth kaala movie postpone

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ నటించిన ‘2.0’ మరియు ‘కాలా’ చిత్రాలు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ‘కాలా’ చిత్రం గత సంవత్సరం మద్యలోనే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా పలు కారణాల వల్ల వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఇక ‘2.0’ మాత్రం విజువల్‌ ఎఫెక్ట్స్‌ వర్క్‌ పూర్తి కాకపోవడంతో వాయిదా వేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు కూడా అభిమానుల్లో కోట్ల అంచనాలను మోస్తున్నాయి. ‘కాలా’ చిత్రం ఈనెల చివర్లో వస్తుందని అంతా భావించారు. కాలా చిత్రం కోసమే అల్లు అర్జున్‌ తన చిత్రాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది. కాని ఇప్పుడు మరోసారి ‘కాలా’ను వాయిదా వేసినట్లుగా సమాచారం అందుతుంది. కాలా చిత్రంకు కొన్ని చిక్కులు ఉన్న కారణంగా అవి క్లీయర్‌ అయ్యే వరకు సినిమాను విడుదల చేయలేమని నిర్మాత చేతులు ఎత్తేశాడు.

‘కాలా’ చిత్రం కొత్త విడుదల తేదీపై ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం లేదు. మే చివర్లో లేదా జూన్‌లో చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. తమిళ సినిమా పరిశ్రమలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు కూడా ‘కాలా’ విడుదలకు అడ్డుగా నిలిచాయి అనే సమాచారం అందుతుంది. మొత్తానికి ఎన్నో అంచనాలున్న ‘కాలా’ చిత్రం మళ్లీ వాయిదా పడటంతో రజినీకాంత్‌ ఫ్యాన్స్‌ తీవ్ర స్థాయిలో నిరుత్సాహంను వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ‘2.0’ చిత్రం కూడా జూన్‌ లేదా జులైలో విడుదల చేయాలని శంకర్‌ భావిస్తున్నాడు. కొంపదీసి ‘కాలా’ మరియు ‘2.0’ చిత్రాలు కేవలం రెండు మూడు వారాల గ్యాప్‌లో వస్తాయా ఏంటీ అంటూ సినీ విశ్లేషకులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.