ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించిన అగ్రరాజ్యం అమెరికా..!

Superpower America declared support for Israel..!
Superpower America declared support for Israel..!

హమాస్‌పై పోరులో ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉంటామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం.. అత్యాధునిక విమాన వాహక నౌకను ఆ దేశ సరిహద్దులకు పంపింది. యూఎస్ఎస్ గెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్‌ అనే ఈ విమాన వాహకనౌకను మధ్యధరా సముద్రంలో మోహరించినట్లు తెలిసింది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ కెరియర్‌లో 5వేల మంది నౌకాదళ సిబ్బందితో పాటు, డెక్‌ నిండా యుద్ధవిమానాలు, మందుగుండు సామాగ్రిని తరలించినట్లు సమాచారం. హమాస్‌ మిలిటెంట్‌ నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు,దాడుల్ని తిప్పికొట్టడానికి పంపినట్లు అమెరికా తెలిపింది. ఉగ్రవాదంపై పోరులో ఆయుధాలు అందిచండంతో పాటు అన్ని విధాలా ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని వెల్లడించింది.

అణు సామర్థ్యం కలిగిన వాహక నౌక USS రూజ్‌వెల్ట్‌లు, USS గెరాల్డ్‌ ఆర్‌ఫోర్డ్‌తో పాటు గైడెడ్‌ మిసైళ్లను ప్రయోగించగల సామర్థ్యం కలిగిన USS నార్మండి, విధ్వంసక యుద్ధనౌకలైన థామస్‌ హడ్‌నర్‌, USS రమెజ్‌, USS కార్నె, అధునాతన యుద్ధ విమానాలు ఎఫ్‌-15, ఎఫ్‌-16,ఎఫ్‌-35లతో పాటు సబ్ సోనిక్‌ అటాక్‌ చేయగల ఏ-10 యుద్ధ విమానాలను మధ్యధరా సముద్రంలో మోహరించింది. ఇజ్రాయెల్‌కు కావలసిన అత్యవసర పరికరాలను, మందుగుండు సామాగ్రిని పంపింస్తున్నామని….మెదటి విడతగా కొన్ని పంపించామని అమెరికా తెలిపింది.