మరికొన్ని రోజుల్లో సుప్రీంకోర్టు అయోధ్య తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ముందుగా జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. కేంద్రం అలర్ట్‌గా ఉండండి అంటూ రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా సూచించింది. అయోధ్య రామ జన్మభూమి బాబ్రీ మసీదు భూ వివాదంపై రానున్న తీర్పుపై ఆయా ప్రాంతాల్లో భద్రతను ఏర్పాటు చేయాలని తెలిపింది. ఉన్నత అధికారులకి దేశంలో ఎక్కడా ఎటువంటి చిన్న ఘటన కూడా జరగకూడదని కేంద్రం తెలిపింది.
అడిషనల్ డైరెక్టర్ జనరల్ ర్యాంక్‌గల పోలీసు అధికారిని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు గానూ ఇన్ఛార్జిగా నియమించారు. అనేక సంవత్సరాలుగా అయోధ్య భూవివాదం పరిష్కారం కాని సమస్యగా ఉండగా కేంద్ర ప్రభుత్వం దాదాపు నాలుగు వేల పారామిలటరీ బలగాలను ముందస్తు చర్యల్లో భాగంగా ఉత్తరప్రదేశ్‌కు పంపింది. అయోధ్యలో నాలుగంచెల భద్రతా వ్యవస్థను అమల్లోకి తీసుకు రావడానికి 12 వేల మంది పోలీసు బలగాలను దింపరని సమాచారం.