బెట్టింగ్ యాప్‌ల నిషేధంపై నేడు (మే 23, 2025న) జరిగిన విచారణలో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేసింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (ka paul) దాఖలు చేసిన పిల్ (పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్) ఆధారంగా ఈ విచారణ జరిగింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను నిషేధించాలని లేదా నియంత్రించాలని కోరుతూ కేఏ పాల్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ యాప్‌ల ద్వారా జూదం ప్రోత్సహించబడుతోందని, యువత జీవితాలు నాశనమవుతున్నాయని ఆయన తన వాదనలో పేర్కొన్నారు