సుప్రీం మద్దతు కూడా ఆమెకే

Supreme Court Verdict favour of Priya varrier
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మలయాళ చిత్రం ‘ఒరు అదార్‌ లవ్‌’లో ఒక హీరోయిన్‌గా నటిస్తున్న ప్రియా ప్రకాష్‌ వారియర్‌కు దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్‌ దక్కిన విషయం తెల్సిందే. ‘ఒరు అదార్‌ లవ్‌’ చిత్రంలోని ఒక పాటలో ఆమె హావభావాలకు యూత్‌ ఆడియన్స్‌ ఫిదా అవుతున్నారు. ఆ పాటలో ఆమె కన్నుగీటి దేశం దృష్టిని ఆకర్షించింది. సోషల్‌ మీడియాలో భారీ రేంజ్‌లో గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడిపై అదే స్థాయిలో కేసులు కూడా నమోదు అవుతున్నాయి. ఒరు అదార్‌ లవ్‌ చిత్రం నుండి వచ్చిన ఆ పాటలో ముస్లీంల మనోభావాలను దెబ్బతీసే విధంగా పధాలు ఉన్నాయని, తమ మనోభావాలు దెబ్బ తిన్నాయి అంటూ ముస్లీంలు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌ పోలీసులు ఇటీవలే ప్రియా వారియర్‌కు నోటీసులు కూడా ఇచ్చారు.

ఒరు అదార్‌ లవ్‌ చిత్ర దర్శకుడు మరియు హీరోయిన్‌ ప్రియా వారియర్‌పై దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో నమోదు అవుతున్న కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రియా వారియర్‌ అండ్‌ కోసం తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీం కోర్టులో ఈ విషయమై నేడు విచారణ జరిగింది. తాము ముస్లీంల మనోభావాలను దెబ్బ తీసే విధంగా సినిమాలో చూపించలేదు అని, తమపై కేసులు పెట్టకుండా, పెట్టిన కేసులను ఎత్తి వేసేలా ఆదేశించాలి అంటూ ప్రియా వారియర్‌ సుప్రీంను ఆశ్రయించిన నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానం కూడా ప్రియా వారియర్‌ వైపు మొగ్గు చూపించింది. దేశంలో ఎక్కడ కూడా ప్రియా వారియర్‌పై కేసులు పెట్టవద్దని, అలాగే సినిమాకు సంబంధించి ఇప్పటికే నమోదు అయిన కేసుల వివరాలను తమకు తెలియజేయాల్సిందిగా పోలీసులను సుప్రీం ఆదేశించింది.