రియలిస్టిక్‌గా తియ్యడానికి హార్డ్వర్క్ కూడా హెల్ప్ చేసిందని,చిరంజీవిగారితో ఇలాంటి సినిమా చేయడాన్ని అదృష్టంఅని “సైరానరసింహారెడ్డి“ దర్శకుడు సురేందర్‌రెడ్డి అన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా చేయాలని ధృవసినిమా సమయంలో అనుకుని,తర్వాత ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గురించి అందుబాటులో ఉన్న పుస్తకాలు, గెజిట్స్, బుర్రకథల గురించి పరిశోధనచేసి సినిమాని చిత్రీకరించామఅని తెలిపారు. దాదాపుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం నిన్న విడుదలైయ్యి మంచి టాక్ కైవసం చేసుకుంది.
వాస్తవసంఘటనల ఆధారంగా తెరకెక్కించినచిత్రం ఇది.ప్రాణత్యాగంచేసిన వీరుణ్ణి మనం ఎలా చూడాలనే కోణంలో కథను రాసుకున్నానని తెలిపారు.తాను తయారుచేసిన కథను పరుచూరి వెంకటేశ్వరరావుగారికి తర్వాత చిరంజీవిగారి వినిపించినని,విన్న తర్వాత చిరంజీవి ఆత్మీయంగా హత్తుకున్నారని చెప్పారు.
యుద్ధ సన్నివేశాలకోసం దాదాపు రెండొందలగుర్రాలు ఇంకా బ్రిటీషర్ల గెటప్‌లో ఉండే నటులకోసం జార్జియా వెళ్లీ అరవైఐదురోజులు ఉండి నలభైరోజులు షూటింగ్ చేశాము.షూటింగ్ కొరకి ఒక సిటీనే నిర్మించి అన్ని బాగోగులు రాంచరణ్ దగ్గర ఉండి చూసుకున్నారని తెలిపారు.