సమంత అక్కినేని తాజాగా యూటర్న్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. కన్నడంలో సూపర్ హిట్ అయిన యూటర్న్ చిత్రం తెలుగు మరియు తమిళంలో సమంత హీరోయిన్గా రీమేక్ అయ్యింది. మొదటి రెండు రోజులు కాస్త డల్‌గా కలెక్షన్స్ ఉన్నా కూడా ఆ తర్వాత మంచి వసూళ్లను రాబట్టింది. భారీ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేక పోయినా కూడా ఒక మోస్తరుగా ఈ చిత్రం ఆకట్టుకుని, వసూళ్లను దక్కించుకుంది అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. సమంత మొదటి హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం సక్సెస్ అవ్వడంతో ప్రస్తుతం ఆమె రెండవ హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
గత కొన్ని రోజులుగా కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’ అనే చిత్రం రీమేక్‌లో సమంత నటించబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ విషయమై క్లారిటీ వచ్చేసింది. నందిని రెడ్డి దర్శకత్వంలో మిస్ గ్రానీ రీమేక్ చేసేందుకు సురేష్ బాబు రైట్స్ తీసుకున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్‌లో సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రంను వచ్చే ఏడాది ప్రారంభించే అవకాశం ఉంది. సురేష్ ప్రొడక్షన్స్‌లో గత కొంత కాలంగా అక్కినేని నాగచైతన్య ఒక చిత్రం చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. కాని తాజాగా చైతూ కంటే ముందే సమంత సినిమాకు కమిట్ అయ్యింది. వచ్చే ఏడాది వెంకీతో కలిసి నాగచైతన్య ఒక చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్‌లో చేయబోతున్న విషయం తెల్సిందే.