లేడి డైరెక్షన్ లో సూరియా 43 , అతనికి అది వందో చిత్రం!

Suriya
Suriya

సౌత్ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించడంలో తనకంటూ ఒక గుర్తింపు పొందిన స్టార్ హీరో సూరియా . అయన సినీ ప్రయాణం ఆరంభం నుంచి కూడా ఆయన అదే పంథా కొనసాగిస్తున్నారు. ఓవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే ఎప్పటికప్పుడు ప్యారలల్‌గా ఏదో ఒక ఆర్టిస్టిక్ సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తుంటారు. చివరగా ‘సూరారై పోట్రు, జై భీమ్’ చిత్రాలకు జాతీయ స్థాయిలో సూరియా కి ప్రశంసలు దక్కాయి.

ఈ క్రమంలోనే ప్రస్తుతం సూరియా .. శివ దర్శకత్వంలో ‘కంగువా’ చిత్రంలో నటిస్తున్నారు. అగ్ర దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో దిశా పటానీ కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ప్రోమోను జులై 22న విడుదల చేయనున్నారు, మేకర్స్. అలాగే ఆ మరుసటి రోజున సూరియా నటించబోయే తదుపరి సినిమా అనౌన్స్‌మెంట్ వెలువడనుంది. అయితే ఆ సినిమాను లేడీ డైరెక్టర్‌తో చేయనున్నారని తెలుస్తోంది.

సూరియా హీరోగా ఆకాశమే నీ హద్దురా చిత్రాన్ని రూపొందించిన సుధ కొంగరనే సూరియా 43 కి దర్శకురాలు. జులై 23న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీని అఫిషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు. ఇక ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా . అతనికి ఇది వందో చిత్రం కానుంది. ఇదిలా ఉంటే.. సూరియా అప్‌కమింగ్ మూవీ స్టోరీ గురించి సుధ కొంగర గతంలో ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

సూరియా 43 చిత్రం ‘సూరారై పోట్రు’ కంటే చాలెంజింగ్ ప్రాజెక్ట్ అని సుధ తెలిపారు. ఈ మూవీని భారీ స్కేల్‌లో రూపొందించడంపై కొంచెం భయంగా ఉందని కూడా ఆమె చెప్పారు. అంతేకాదు నిజ జీవిత కథ ఆధారంగానే ఈ సినిమా ఉంటుందన్న సుధ.. కానీ ఇది బయోపిక్ మాత్రం కాదన్నారు. అదొక ఇన్సిడెంట్‌గా మాత్రమే సినిమా రూపంలో ఆవిష్కరిస్తానని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఒక ఆసక్తికరమైన విషయం నెట్టింట వైరల్ అవుతోంది. సూరియా , దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో ఇప్పటికే ‘వాడివాసల్’ మూవీ అనౌన్స్ చేశారు.ఇది జీవీ ప్రకాష్ కుమార్‌కు 75వ సినిమా. ఈ ప్రాజెక్టును 2020లోనే ప్రకటించినా.. ఇంత వరకు సెట్స్‌పైకి వెళ్లలేదు. కానీ జీవీ ప్రకాష్ మాత్రం ఈ లోపుగా మరో 25 సినిమాలు పూర్తి చేశాడు. ఇక దర్శకుడు వెట్రిమారన్ ‘విడుదలై : పార్ట్ 1’ చిత్రాన్ని రూపొందించగా ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. తెలుస్తున్న సమాచారం మేరకు ‘విడుదలై: పార్ట్ 2’ కంప్లీట్ చేసిన తర్వాతే ఆయన ఈ ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేయనున్నారు.