“హత్య” కేసు లో విజయ్ ఆంటోనీ..?

Vijay Antony
Vijay Antony

హీరో విజయ్ ఆంటోనీ కథానాయకుడు గా వస్తున్న సినిమా “హత్య “. బిచ్చగాడు 2 సినిమా తర్వాత వస్తున్న మూవీ కానందుకు మంచి హైక్ వచ్చింది . బాలాజీ కుమార్ దర్శకత్వం లో వస్తున్న మర్డర్ మిస్టరీ మూవీ “హత్య ” . ఇటీవల కాలంలో రిలీజ్ అయినా ట్రైలర్ ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తుంది.

ఈ ట్రైలర్ స్టార్టింగ్ లోనే “ఎంత జీవితం లో గెలిచిన చావు దగ్గర తప్పకుండ ఓడిపోతావు “నేనొక ప్రొఫెషనల్ మోడల్ ని ఊపిరి ఉన్న బొమ్మ ఏదో సాధించాలని అనుకునే లోపే నన్ను చంపేశారు”అటువంటి కేసు ని చేధించడానికి ప్రముఖుడైన విజయ్ ఆంటోనీ ని నియమిస్తారు “ఒక అబద్దపు శబ్దం నా చెవికి ఎలా వినిపిస్తుందో నాకు బాగా తెలుసని ” అని ట్రైలర్ లో పొందుపరిచారు .

ఎవరు ఆ మోడల్ ? ఎందుకు చంపారు ? చంపడానికి గల కారణమేమి ? తెలియాలి . అటువంటి కేసు ని టేకప్ చేసి విజయ్ ఆంటోనీ ఆ మిస్టరీ ని ఎలా ఛేదించాడని తెలియాలంటే ఆ మూవీ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయవలసిందే . రితిక సింగ్ మరియు మీనాక్షి చౌదరి లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు . గిరీష్ గోపాల కృష్ణన్ సంగీతం అందిస్తున్నారు . ఈ సినిమాకి ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ అండ్ లోటస్ పిక్చర్స్ వాళ్ళు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జులై 21 న విడుదల చేయాలని చిత్ర బృందం ఇప్పటికే తెలియజేసారు .