న్యూ బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రేమ్ కుమార్.. ఏమిటంటే?

Santosh Shobhan
Santosh Shobhan

సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమా ‘ప్రేమ్ కుమార్’ . ఈ సినిమాలో నటుడు,రచయిత అయినా అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై.లి. పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే… సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు.

‘ప్రేమ్ కుమార్’లో సంతోష్ శోభన్ హీరో. ఈ సంగతి ప్రేక్షకులకు తెలుసు.ఇందులో మరో హీరో కూడా ఉన్నాడు. అతని పేరు కృష్ణ చైతన్య. ‘ప్రేమ్ కుమార్’ కథలో అతడు హీరోగా , చిత్రసీమ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో కనిపించనున్నారు. రీల్ లైఫ్‌లోని రీల్ లైఫ్‌లో హీరో అన్నమాట. ఈ సినిమాలో హీరోయిన్ రాశీ సింగ్ అయితే.రుచితా సాధినేని రీల్ లైఫ్‌లోని రీల్ లైఫ్‌లో హీరోయిన్ రోల్ చేశారు.

కథగా చూస్తే సంతోష్ శోభన్ హీరో కాగా . అతనికి విలన్ కృష్ణ చైతన్య. రాశీ సింగ్, రుచితా సాధినేని. ఇద్దరు హీరోయిన్లు ఎవరిని ప్రేమించారు? ఎవరి ప్రేమ కారణంగా ఎవరికి ఇబ్బందులు తలెత్తాయి? రుచితా సాధినేని ప్రేమించినది ఎవర్ని.సంతోష్ శోభన్‌నా? లేదంటే సినిమాలోని సినిమాలో హీరోగా నటించిన కృష్ణ చైతన్యనా? రాశీ సింగ్ ఏమనుకుంటుంది? సంతోష్ శోభన్‌ను కృష్ణ చైతన్య ఏం చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

‘ప్రేమ్ కుమార్’ ట్రైలర్ చూస్తే.హీరో , పెళ్లి విషయానికి వస్తే పెటాకులే ఎక్కువ అవుతుంటాయి . ఎక్కడికి వెళ్లిన , ఏ పెళ్లి చూపులకి వెళ్లిన పెటాకులు అవుతుంటాయి . ఈ నేపథ్యంలో హీరో ఇక తనకి పెళ్లి కాదని ఒక బిజినెస్ పెడతాడు . అదే పెళ్లి పెటాకులు ఎలా చేయాలనీ… ఒక విధమైన గజిబిజి గందరగోళం క్రియేట్ చేశారు. సాధారణంగా తెలుగు తెరపై ముక్కోణపు ప్రేమ కథలు చాలా వచ్చాయి. ఇది రెండు జంటల నేపథ్యంలో ప్రేమతో తెరకెక్కించిన సినిమాగా తెలుస్తోంది. సామాన్య ప్రేక్షకులకు కథపై కాస్త క్లారిటీ రావాలంటే సినిమా విడుదల వరకు వెయిట్ చేయాలి. పెళ్లి పీటల మీదకి వెళ్లి పెళ్లి ఆగిపోతే, ఆ పెళ్లి కొడుకు ఏం చేశాడు? అనే కథతో రూపొందిన చిత్రమిది. ఇదొక హిలేరియస్ ఎంటర్టైనర్ అని నిర్మాత తెలిపారు.