సెన్సార్ పూర్తి చేసుకున్న “HER”

Ruhani Sharma
Ruhani Sharma

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రుహాణి శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం “HER”. కెరీర్ పరంగా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్న రుహాణి, ఇప్పుడు మరో డిఫరెంట్ లేడీ ఓరియెంటెడ్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు . డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్ గా ఈ సినిమాను రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు.

ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా చేసుకుంది.”HER” మూవీని చూసిన సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. చిత్రంలోని సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని చెబుతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు సెన్సార్ సభ్యులు. ఈ చిత్రంలో ప్రదీప్ రుద్ర, సంజయ్ స్వరూప్, వికాస్ వశిష్ట, , జీవన్ కుమార్, అభిగ్న్య, బెనర్జీ, ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభం నుంచే ప్రమోషన్స్ చేపడుతూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు మేకర్స్.

ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ మొదలుకొని టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ తీసుకొస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచాయి. HER ఫైనల్ కాపీ చూసిన టాలీవుడ్ బడా బ్యానర్ అయినా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయడానికి ముందుకు రావడం విశేషం. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ద్వారా జూలై 21న థియేటర్లోకి విడుదల కాబోతుంది . ఈ చిత్రానికి చాణక్య తూరుపు ఎడిటర్ గా , చాణక్య తూరుపు  సినిమాటోగ్రఫీ అందించగా, వ్యవహరించారు. పవన్ బాణీలు కట్టారు. ఈ సినిమా రుహాణి కెరీర్ లో ది బెస్ట్ చిత్రం అవుతుందని, భారీ ప్రేక్షకాదరణ పొందుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.