ఆమెను చూస్తే జాలి కలుగుతోందని చెప్పిన సూర్య కిరణ్

ఆమెను చూస్తే జాలి కలుగుతోందని చెప్పిన సూర్య కిరణ్

బిగ్ బాస్ సీజన్ 4‌లో తొలివారమే ఎలిమినేట్ అయ్యి హౌస్‌ నుంచి బయటకు వచ్చేశారు దర్శకుడు సూర్య కిరణ్. అయితే తాను తొలివారమే ఎలమినేట్ అవుతానని ఊహించలేదంటున్న సూర్య కిరణ్ ఇంటి సభ్యుల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ కరాటే కళ్యాణిపై షాకింగ్ కామెంట్స్ చేశారు.బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నవాళ్లలో కరాటే కళ్యాణి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుందని.. ఇది కూడా తెలియదా? వీళ్లకి అనేవాళ్లలో కరాటే కళ్యాణి ముందుంటుందని అన్నారు దర్శకుడు సూర్య కిరణ్.

బిగ్ బాస్ హౌస్‌లో ఎవరి ఆట వాళ్లు ఆడుకుంటున్నారు.. ఆమెకు మాత్రం అది అర్థం కావట్లేదు. కరాటే కళ్యాణిలో మంచి టాలెంట్ ఉంది.. కరాటే తెలుసు.. హరికథ చెప్తోంది చాలా టాలెంట్లు ఉన్నాయి. ఆమెకు ఉన్న టాలెంట్ల‌లో 10 శాతం కూడా మిగిలిన వాళ్లకు లేదు. కాని అంత టాలెంట్ ఉన్న ఆమెను ఆడుకుంటున్నారనే విషయం ఆమెకు తెలియడం లేదు. ఆమెను చూస్తే.. కోపంలా లేదు కాని.. పాపంలా అనిపిస్తుంది. జాలి కలుగుతోంది.

ఆమెతో నాకు గొడవలు లేవు.. కాని అరియానాకి ఫుడ్ ఇచ్చిన విషయంలో చిన్న డిస్కషన్ జరిగింది. వాళ్ల ఆట వాళ్లు ఆడుతున్నారు.. మీరు ఎందుకు ఫుడ్ ఇచ్చారని అడిగా.. 14 మంది ఒక మాట మీద ఉండి టాస్క్ ఆడుతుంటే.. ఆమె మాత్రం తనకు నచ్చినట్టు చేసింది.అయితే నేను బయటకు రావాలనే వచ్చా.. రెండు వారాలు ఉంటానని వెళ్లా.. కాని మొదటి వారంలోనే వచ్చేశా. బిగ్ బాస్ హౌస్‌లో ఇన్నోసెంట్ అనేట్టు ఎవరూ లేరు.. గంగవ్వ తప్ప మిగిలిన వాళ్లంతా చాలా తెలివిగా ఆడుతున్నారు’ అంటూ చెప్పుకొచ్చారు సూర్య కిరణ్.