సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట టీవీ సీరియల్స్‌లో ప్రారంభమైన అతని కెరీర్ ఆ తర్వాత స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగింది. ఎంఎస్ ధోనీ, చిచోరే వంటి చిత్రాలతో మరింత పాపులర్ అయ్యాడు.
స్టార్ స్టేటస్‌తో కేరీర్లో దూసుకుపోతున్న సమయంలోనే అర్థాంతరంగా తనువు చాలించాడు. సుశాంత్ మనకు దూరమై రెండేళ్లయినా ఇంకా అతని మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నేడు సుశాంత్ 36వ జయంతి. ఈ సందర్భంగా అభిమానులు సహా పలువురు సోషల్ మీడియా వేదికగా సుశాంత్‌కు నివాళులు అర్పిస్తున్నారు.
సుశాంత్ మరణించే సమయంలో ప్రియురాలుగా ఉన్న రియా చక్రవర్తి సైతం సుశాంత్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. జిమ్‌లో ఇద్దరూ వర్కవుట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. మిస్ యూ సో మచ్ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా సుశాంత్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను సైతం ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ లవ్ ఎమోజీని జతచేసింది. ప్రస్తుతం రియా షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.